క్రీడాభూమి

రియో వెళ్లండి విజేతలుగా తిరిగి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌కు వెళ్లి విజేతలుగా తిరిగిరావాలంటూ వారికి వీడ్కోలు పలికారు. మానెక్‌షా సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రియోకు వెళ్లే భారత బృందంతో ప్రధాని భేటీ అయ్యారు. హాజరైన ప్రతి ఒక్కరినీ ఆయన స్వయంగా కలవడం విశేషం. కొంత మంది అథ్లెట్లు ప్రధానితో సెల్ఫీలు దిగారు. మరికొందరు మోదీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మొత్తం మీద సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి జితేంద్ర సింగ్, క్రీడా కార్యదర్శి రాజీవ్ యాదవ్, అఖిల భారత క్రీడా మండలి (ఎఐసిఎస్) చైర్మన్ విజయ్ మల్హోత్రా, ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా, హాకీ ఇండియా అధ్యక్షుడు నరీందర్ బత్రా, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ముస్తాక్ అహ్మద్, జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, బాక్సింగ్ కోచ్ గుర్‌బాక్స్ సింగ్ సంధు, భారత మహిళా హాకీ జట్టు చీఫ్ కోచ్ నీల్ హావ్‌గుడ్, కోచ్ సిఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే వందకుపైగా అథ్లెట్లు రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. రానున్న రోజుల్లో మరికొంత మంది క్వాలిఫై అయ్యే అవకాశాలున్నాయి. భారత బృందంలో కనీసం 110 మంది వరకూ క్రీడాకారులు ఉంటారని అధికారులు అంటున్నారు. గతంలో ఎన్నడూ భారత్ వందకు మించిన అథ్లెట్లతో కూడిన బృందాన్ని ఒలింపిక్స్‌కు పంపలేదు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అత్యధికంగా 83 మంది పాల్గొన్నారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగే రియో ఒలింపిక్స్‌లో వందకుపైగా క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. కాగా, మానెక్‌షా సెంటర్‌లో సోమవారం జరిగిన కార్యక్రమానికి షూటర్లు జితూ రాయ్, మానవ్‌జిత్ సింగ్ సంధు, హీనా సిద్ధు, షట్లర్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్, బాక్సర్ శివ థాపా, లాంగ్ డిస్టెన్స్ రన్నర్లు సుధా సింగ్, లలితా బాబర్ తదితరులు హాజరయ్యారు. వివిధ దేశాల్లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న కారణంగా చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. మహిళా హాకీ జట్టు సభ్యులు తమ చీఫ్ కోచ్‌తో కలిసి ప్రధానిని ప్రత్యేకంగా కలిశారు. ఆయనతో ఫొటోలు దిగారు. మోదీని కలవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఆయన స్వయంగా వచ్చి అభినందనలు తెలపడం తమ అదృష్టమని బాక్సర్ శివ థాపా ట్వీట్ చేశాడు. ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు.

న్యూఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో బాక్సర్ శివ థాపాకు వీర తిలకం దిద్దుతున్న కేంద్ర క్రీడల మంత్రి జితేందర్ సింగ్