క్రీడాభూమి

ఫెదరర్ ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్ తన ఖాతాలో మరో టైటిల్‌ను గెల్చుకున్న దిశగా ముందడుగు వేశాడు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో అతను స్టీవ్ జాన్సన్‌ను 6-2, 6-3, 7-5 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ అనూహ్యంగా మూడో రౌండ్‌లోనే ఓటమిపాలైన నేపథ్యంలో ఈసారి పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకునే అవకాశం కోసం రెండో సీడ్ ఆండీ ముర్రేతోపాటు ఫెదరర్ కూడా రేసులో ఉన్నాడు. ఇలావుంటే, జొకోవిచ్‌ను ఓడించి సంచలనం సృష్టంచిన శామ్ క్వెర్రీ కూడా క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. ఈ ‘జెయింట్ కిల్లర్’ మూడో రౌండ్‌లో నికొలస్ మాహుత్‌ను 6-4, 7-6, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. మారిన్ సిలిక్‌తో తలపడిన కెయ్ నిషికోరి మొదటి సెట్‌ను 1-6 తేడాతో చేజార్చుకున్నాడు. రెండో సెట్‌లో 1-5 తేడాతో వెనుకంజలో ఉన్న సమయంలో కండరాల నొప్పితో మ్యాచ్‌ని కొనసాగించలేక వైదొగ్గా సిలిక్ క్వార్టర్స్ చేరాడు.