క్రీడాభూమి

వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ రద్వాన్‌స్కాకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 4: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్ రేసులో ఉన్న మూడో సీడ్ అగ్నిస్కా రద్వాన్‌స్కా అనూహ్యంగా ప్రీ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో ఉన్న డొనినికా సిబుల్కొవా 6-3, 5-7, 9-7 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన రద్వాన్‌స్కాను ఆత్మరక్షణలోకి నెట్టిన సిబుల్కొవా తొలి సెట్‌ను సులభంగా గెల్చుకుంది. అయితే, రెండో సెట్‌లో రద్వాన్‌స్కా ఎదురుదాడికి దిగడంతో పోరు హోరాహోరీగా సాగింది. ఆ సెట్‌ను రద్వాన్‌స్కా సొంతం చేసుకోవడంతో చివరిదైన మూడో సెట్ కీలకంగా మారింది. ఇరువురు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. చివరికి ఆ సెట్‌ను సాధించిన సిబుల్కొవా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. మరో మ్యాచ్‌లో అనస్తాసియా పవ్లిచెన్కొవా 6-3, 6-3 తేడాతో కొకో వాండెవాగ్‌పై గెలిచింది. ఈ మ్యాచ్ దాదాపు ఏకపక్షంగా సాగింది. ఏంజిలిక్ కెర్బర్ 6-3, 6-1 ఆధిక్యంతో మిసాకీ డోయ్‌ను సులభంగా ఓడించింది. యార్లొస్లొవా ష్వెడోవా 6-2, 6-4 స్కోరుతో లూసీ సఫరోవాపై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఐదో సీడ్ సిమోనా హాలెప్ 6-7, 6-4, 6-3 తేడాతో మాడిస్ కీస్‌పై
విజయం సాధించింది.

ప్రీ క్వార్టర్స్‌లో చుక్కెదురు..
అగ్నిస్కా రద్వాన్‌స్కా

వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరిన డొనినికా సిబుల్కొవా