క్రీడాభూమి

ఒలింపిక్స్‌పైనే దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: లండన్‌లో ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో పతకాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని సాధించిన తర్వాత భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్ ఇప్పుడు దృష్టి అంతా రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించడంపై పెట్టారు. 1982లో కాంస్య పతకం తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో రజత పతకం సాధించడం భారత జట్టు సాధించిన అత్యుత్తమ ప్రతిభ కావడం గమనార్హం. ‘చాంపియన్స్ ట్రోఫీలో పతకం సాధించడమే మా లక్ష్యంగా ఉండింది. దాన్ని మేము సాధించాం. ఇప్పుడది తెరవెనుకకు వెళ్లింది. మా దృష్టి అంతా కూడా రాబోయే ఒలింపిక్స్‌పైనే ఉంది’ అని విజయవంతమైన విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం ఇక్కడికి చేరుకున్న తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ఓల్ట్స్‌మన్ చెప్పారు. వలెన్సియాలో జరిగిన ఆరు దేశాల ఇన్విటేషన్ టోర్నమెంట్‌లో, ఆ తర్వాత చాంపియన్స్‌ట్రోఫీలో అద్భుత ప్రదర్శన అనంతరం భారత హాకీ జట్టు మంగళవారం స్వదేశం తిరిగి వచ్చింది. ఈ రెండు టోర్నమెంట్ల తర్వాత జట్టుకు విశ్రాంతి కాస్త అవసరమని, అటు తర్వాత తాము ఒలింపిక్స్‌కోసం శిక్షణను మొదలుపెడతామని ఆయన చెప్పారు.
చాలా మంది యువ ఆటగాళ్లతో కూడిన భారత హాకీ జట్టు అటు వలెన్సియా టోర్నమెంట్‌లోను, ఇటు చాంపియన్స్ ట్రోఫీలోను ఫైనల్స్ దాకా వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ ర్యాకింగ్స్‌లో భారత్ అయిదో స్థానానికి ఎదిగింది. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టులోని హర్మన్‌ప్రీత్ సింగ్ ఉత్తమ వర్ధమాన ఆటగాడి అవార్డును దక్కించుకున్నాడు కూడా. సీనియర్ జట్టుతో కలిసి ఆడడం తనకు లభించిన గొప్ప అవకాశమని, ఈ పర్యటనతో తానెంతో నేర్చుకున్నానని, దీనివల్ల రాబోయే ఒలింపిక్స్‌కు తామంతా ఒక యూనిట్‌గా రాణించడానికి సిద్ధంగా తయారయ్యామని అతను చెప్పాడు. జట్టు సాధించిన విజయాలు చూసి తామంతా గర్విస్తున్నామని, ఇప్పుడు తమ దృష్టి అంతా రాబోయే రియో ఒలిపింక్స్‌లో రాణించడంపైనే ఉందని జట్టు కెప్టెన్, గోల్‌కీపర్ అయిన ఆర్‌పి శ్రీజేష్ చెప్పాడు.

చిత్రం.. న్యూఢిల్లీ చేరుకున్న భారత హాకీ ఆటగాళ్లు