క్రీడాభూమి

‘రియో’ బెర్తుకు చేరువైన నీరజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: రియో ఒలింపిక్స్‌లో బెర్తును ఖరారు చేసుకునేందుకు భారత బాక్సర్, డబ్ల్యుబిసి ఆసియా చాంపియన్ నీరజ్ గోయత్ మరో అడుగు దూరంలో నిలిచాడు. ప్రొఫెషనల్ బాక్సర్ల కోసం అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబిఎ) వెనెజులాలోని వర్గాస్‌లో నిర్వహిస్తున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన గౌరవ్ బిధూరీ (52 కిలోల విభాగం), దిల్బాగ్ సింగ్ (81 కిలోల విభాగం) తొలి రౌండ్ బౌట్లలోనే ఓటములతో నిష్క్రమించినప్పటికీ 69 కిలోల విభాగంలో యువ బాక్సర్ నీరజ్ గోయత్ (24) సత్తా చాటుకుని సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో గ్రీస్‌కు చెందిన దిమిత్రియోస్ పౌలికోస్‌ను 0-3 తేడాతో మట్టికరిపించిన నీరజ్ గోయత్ ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన జర్మన్ బాక్సర్, యూరోపియన్ చాంపియన్‌షిప్స్ మాజీ రజత పతక విజేత అరాజిక్ మరుత్జాన్‌తో గురువారం సెమీఫైనల్‌లో తలపడనున్నాడు. ఈ బౌట్‌లో నీరజ్ గోయత్ విజయం సాధిస్తే ఒలింపిక్ బెర్తు ఖరారవుతుంది. ఒకవేళ గోయత్‌కు ఓటమి ఎదురైతే సెమీఫైనల్స్ పరాజితుల మధ్య జరిగే పోరు ద్వారా అతను ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు మరో అవకాశం ఉంటుంది.