క్రీడాభూమి

ఒలింపిక్స్‌కు రష్యా అథ్లెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 5: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అనుమతించాలని కోరుతూ అభ్యర్థించిన 68 మంది అథ్లెట్ల జాబితాను రష్యా మంగళవారం ప్రచురించింది. ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌ను ప్రోత్సహించారన్న ఆరోపణలపై అంతర్జాతీయ అథ్లెటిక్ ఫెడరేషన్ రష్యా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్సపై రెండేళ్ల పాటు నిషేధం విదించిన విషయం తెలిసిందే. అయితే రియో ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లు ఏ దేశానికి చెందని వారుగా పోటీ చేయడానికి మాత్రం అనుమతించింది. ఈ 87 మంది అథ్లెట్లు రష్యా కోచ్‌లు నిర్ణయించిన ప్రమాణాలను నెరవేర్చారని రష్యా అథ్లెటిక్ ఫెడరేషన్(ఎఆర్‌ఎఎఫ్) తెలియజేసింది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడం కోసం అంతర్జాతీయ అథ్లెటిక్ ఫెడరేషన్ ద్రువీకరణ కోసం ప్రతి అథ్లెట్ వ్యక్తిగతంగా దరఖాస్తు పంపుకొన్నారని ఎఆర్‌ఎఎఫ్ తెలిపింది. ఈ జాబితాలో హర్డిల్స్ ప్రపంచ చాంపియన్ సెర్గీ షుబెంకోవ్, లాంగ్‌జంపర్ డార్యా క్లిషినా, పోల్‌వాల్టర్ సరీనా యెలెంకో ఇసిన్‌బయేవాలాంటి వారి పేర్లున్నాయి.