క్రీడాభూమి

టి-20 హీరో డు ప్లెసిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 23: దక్షిణాఫ్రికా టి-20 కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ ఆ విభాగంలో ఉత్తమంగా రాణించిన ఆటగాడిగా అవార్డు ఎంపికయ్యాడు. ఈ ఏడాది జనవరి 11న వెస్టిండీస్‌తో జొహానె్నస్‌బర్గ్‌లో జరిగిన టి-20లో అతు కేవలం 56 బంతుల్లోనే 116 పరుగులు సాధించాడు. ఈస్కోరులో 11 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ సుడిగాలి బ్యాటింగ్ అతనికి అవార్డును సంపాదించిపెట్టింది.
‘ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జొష్ హాజెల్‌వుడ్‌కు లభించింది. ఐసిసి ‘అసోసియేట్, అఫ్లియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కెప్టెన్ ఖుర్రం ఖాన్ దక్కించుకున్నాడు. అవార్డుకు నిర్ణయించిన కాలంలో అతను 9 వనే్డ ఇంటర్షేనల్స్ ఆడి 425 పరుగులు చేశాడు. టెస్టు హోదావున్న 10 దేశాల క్రికెటర్లు కాకుండా ఇతర జట్ల క్రికెటర్లు ఉత్తమంగా రాణిస్తే, వారికి ఈ అవార్డును ఇస్తారు. ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డుకు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఎంపికయ్యాడు. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సమయంలో అతని క్రీడాస్ఫూర్తిని అందరూ కొనియాడారు. దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా సాగిన మ్యాచ్ తర్వాత అతను ప్రత్యర్థి వనే్డ కెప్టెన్ ఎబి డివిలియర్స్‌ను డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఆహ్వానించి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. ఐసిసి ఉత్తమ అంపైర్‌కు ఇచ్చే ‘డేవిడ్ షెపర్డ్ ట్రోఫీ’ రిచర్డ్ కెటిల్‌బరో వరుసగా మూడోసారి గెల్చుకొని ‘హ్యాట్రిక్’ను నమోదు చేశాడు. ఈ విధంగా వరుసగా మూడు సంవత్సరాలు అవార్డును అందుకున్న మూడో అంపైర్‌గా అతను రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. గతంలో సైమన్ టౌఫెల్ 2004 నుంచి 2008 వరకూ వరుస ట్రోఫీలను స్వీకరించాడు. అలీమ్ దార్ 2009 నుంచి 2011 వరకూ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.
మహిళల విభాగంలో..
మహిళల విభాగంలో అత్యుత్తమ వనే్డ క్రీడాకారిణిగా ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ ఎంపికైంది. టి-20 ఫార్మెట్‌లో ఈ అవార్డును వెస్టిండీస్ కెప్టెన్ స్ట్ఫానీ టేలర్ సొంతం చేసుకుంది.