క్రీడాభూమి

క్వార్టర్స్‌కు ‘సాన్‌టినా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 5: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన హైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో టాప్ సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు మహిళల డబుల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో మెక్‌హాలే (అమెరికా), జెలెనా ఒస్తాపెంకో (లాత్వియా) జోడీపై ఘనవిజయం సాధించారు. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ పోరులో సానియా, హింగిస్ 6-1, 6-0 తేడాతో సునాయాసంగా ప్రత్యర్థులను మట్టికరిపించారు.
అయతే మిక్స్‌డ్ డబుల్స్‌లో క్రొయేషియా ఆటగాడు ఇవాన్ డోడిగ్‌తో కలసి బరిలోకి దిగిన సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. టాప్‌సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు మంగళవారం ఇక్కడ జరిగిన రెండో రౌండ్ పోరులో బ్రిటన్‌కు చెందిన అన్‌సీడెడ్ జోడీ నెయాల్ స్కుప్‌స్కీ, అన్నా స్మిత్ చేతిలో పరాజయం పాలయ్యారు. మ్యాచ్ ఆరంభంలో బాగానే ఆడి 6-4 తేడాతో తొలి సెట్‌ను గెలుచుకున్న సానియా, డోడిగ్‌లకు ఆ తర్వాత ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. దీంతో 3-6, 5-7 తేడాతో వరుసగా రెండు సెట్లను చేజార్చుకున్న సానియా, డోడిగ్‌లకు ఓటమి తప్పలేదు.
ఇదిలావుంటే, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మార్టినా హింగిస్‌తో కలసి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ కూడా మరో అడుగు ముందుకేశాడు. ప్రస్తుతం ఆరో సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు 6-4, 6-4 వరుస సెట్ల తేడాతో ఆర్టెమ్ సితాక్ (న్యూజిలాండ్), లారా సిగెమండ్ (జర్మనీ) జోడీపై అలవోకగా విజయం సాధించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. అయితే భారత్‌కు చెందిన మరో ఆటగాడు రోహన్ బొపన్నకు మాత్రం మిశ్రమ ఫలితాలు లభించాయి. ఆస్ట్రేలియాకు చెందిన అనస్తాసియా రోడినోవాతో కలసి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో 13వ సీడ్ జోడీగా బరిలోకి దిగిన బొపన్న 6-3, 7-5 తేడాతో ట్రీట్ హుయి (్ఫలిప్పీన్స్), అలిక్జా రొసోల్‌స్కా (పోలెండ్) జోడీని ఓడించి మూడో రౌండ్‌లో ప్రవేశించాడు. అయితే పురుషుల డబుల్స్ విభాగంలో రొమేనియాకు చెందిన ఫ్లోరిన్ మెర్గియాతో కలసి బరిలోకి దిగిన బొపన్నకు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లోనే నిరాశ ఎదురైంది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో బొపన్న, మెర్గియాపై 10వ సీడ్ జోడీ హెన్రీ కొంటినెన్ (్ఫన్లాండ్), జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) 2-6, 6-3, 6-4, 6-7(6), 8-6 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.