క్రీడాభూమి

జైపూర్ చేతిలో ఢిల్లీ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో బుధవారం ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 51-26 తేడాతో దబాంగ్ ఢిల్లీని చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ ఆధిపత్యాన్ని కనబరచిన జైపూర్ 25 పాయింట్ల తేడాతో గెలిచి, ఇప్పటి వరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 20 పాయింట్లను సంపాదించి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. రాజేష్ నర్వాల్ 16 పాయింట్లు సాధించి జైపూర్ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. కెప్టెన్ జస్వీర్ సింగ్ తొమ్మిది, అమిత్ హూడా 6 చొప్పున పాయింట్లు చేశారు. ఢిల్లీ ఆటగాల్లలో మెరాజ్ షేక్ అత్యధికంగా ఎనిమిది పాయింట్లు సాధించాడు. కెప్టెన్ కషిలింగ్ అడాకే ఏడు పాయింట్లతో రాణించాడు. మిగతా ఆటగాళ్లు దారుణంగా విఫలం కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.
టైటాన్స్ గెలుపు: యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్‌స జట్టు ఐదు పాయంట్ల తేడాతో విజయం సాధించింది. టైటాన్స్ 35 పాయంట్లు సంపాదించగా యు ముంబా 30 పాయంట్లు చేయగలిగింది. టైటాన్స్ తరఫున నీలేష్ సలోంకే, కెప్టెన్ రాహుల్ చౌదరీ చెరి ఎనిమిది పాయంట్లు సాధించారు. యు ముంబా తరఫున రాకేష్ కుమార్ 11 పాయంట్లు చేశాడు.

జైపూర్ పింక్ పాంథర్స్, దబాంగ్ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌లో ఓ దృశ్యం

సచిన్ కాలికి శస్తచ్రికిత్స
లండన్, జూలై 6: భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ తెండూల్కర్‌కు ఇక్కడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. ఎడమ కాలికి పట్టీ కట్టుకున్న ఫొటోను అతను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కొన్ని ఫిట్నెస్ సమస్యలు తలెత్తాయని పేర్కొన్నాడు. వైద్యుల సూచన మేరకు ఎడమ కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలిపాడు.