క్రీడాభూమి

కుట్ర చేసి తొలగించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూలై 7: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) అధ్యక్షుడు కొట్నీ బ్రౌనే కుట్ర చేసి తనను జాతీయ జట్టు నుంచి తొలగించాడని వికెట్‌కీపర్ దనేష్ రాందీన్ ధ్వజమెత్తాడు. భారత్‌తో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు విండీస్ సెలక్టర్లు ఇంకా జట్టును ప్రకటించలేదు. అయితే, తనను జట్టులోకి తీసుకోలేదంటూ రాందీన్ ట్వీట్ చేశాడు. డబ్ల్యుఐసిబి కొత్త చైర్మన్ బ్రౌనే కుట్ర ఫలితంగానే తనకు జట్టులో చోటు దక్కలేదని ఆరోపించాడు. నిరుడు ఆస్ట్రేలియాతో అతను చివరి టెస్టు సిరీస్ ఆడాడు. చివరి రెండు ఇన్నింగ్స్‌లో 59, 62 చొప్పున పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై తాను రాణించానని, ఇంతకంటే ప్రతిభను నిరూపించుకోవడానికి ఏం కావాలని ప్రశ్నించాడు. తన గణాంకాలు విండీస్ జట్టులో స్థానాన్ని సంపాదించుకునే స్థాయిలో లేవని బ్రౌనే పేర్కొన్నాడని, ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని రాందీన్ ట్విటర్‌లో వాపోయాడు.