క్రీడాభూమి

పోరాడి గెలిచిన ముర్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 7: బ్రిటిష్ ఆటగాడు ఆండీ ముర్రే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో చివరి వరకూ పోరాడి విజయం సాధించాడు. జో విల్‌ఫ్రైడ్ సొంగాతో జరిగిన పోరులో అతను 7-6, 6-1, 3-6, 4-6, 6-1 తేడాతో విజయం సాధించాడు. 29 ఏళ్ల ముర్రేకు కెరీర్‌లో గ్రాస్‌కోర్టులపై ఇది వందో విజయం కావడం విశేషం. మొదటి రెండు సెట్లను గెల్చుకున్న ముర్రే ఆతర్వాత రెండు సెట్లలో సొంగా ఎదురుదాడి ముందు నిలవలేకపోయాడు. దీనితో వరుసగా రెండు సెట్లను కోల్పోయి ఓటమి ప్రమాదంలో పడ్డాడు. కానీ, చివరి సెట్‌లో చావోరేవో తేల్చుకోవాలన్న పట్టుదలతో పోరాడిన ముర్రే సులభంగానే దానిని సొంతం చేసుకొని, సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. నిజానికి ముర్రేను టెన్నిస్ చరిత్రలో దురదృష్టవంతులైన ఆటగాళ్లలో ఒకడిగా పేర్కోవాలి. కెరీర్‌లో అతను 10 పర్యాయాలు మేజర్ టోర్నీల్లో ఫైనల్స్ చేరాడు. కానీ, రెండు సార్లు మాత్రమే టైటిళ్లను కైవసం చేసుకోగా, ఎనిమిది పరాజయాలను చవిచూశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నొవాక్ జొకోవిచ్‌ను ఢీకొని, మరోసారి రన్నరప్ ట్రోఫీకే పరిమితయ్యాడు. మేజర్ టోర్నీల్లో ఎదుర్కొన్న ఎనిమిది పరాజయాల్లో ఐదు జొకోవిచ్ చేతిలో ఎదురైనవే కావడం గమనార్హం. గ్రాండ్ శ్లామ్స్ విషయానికి వస్తే, ఆస్ట్రేలియా ఓపెన్‌లో అతను 2010, 2011, 2013, 2015 సంవత్సరాలతోపాటు ఈ ఏడాది కూడా ఫైనల్ చేరాడు. కానీ, ప్రతిసారీ అతడిని ఓటమి వెక్కిరించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరినా ఫలితం లేకపోయింది. ఫైనల్ చేరిన మిగతా రెండు సందర్భాల్లో (2005లో వింబుల్డన్, 2008లో యుఎస్ ఓపెన్) ముర్రే టైటిళ్లను సాధించాడు. మొత్తం మీద ఎక్కువ పర్యాయాలు మేజర్ టోర్నీ ఫైనల్స్‌లో విఫలమైన ఆటగాళ్ల జాబితాలో ముర్రేకు కూడా స్థానం ఉంటుంది. ఈసారి అతను టైటిల్ సాధించి, తనపై ఉన్న దురదృష్టవంతుడనే ముద్రను చెరిపేసుకుంటాడో లేదో చూడాలి. కాగా, మరో మ్యాచ్‌లో లుకాస్ పౌలీని 7-6, 6-3, 6-2 ఆధిక్యంతో వరుస సెట్లలో ఓడించిన థామస్ బెర్డిచ్ కూడా సెమీస్‌లోకి అడుగుపెట్టాడు.