క్రీడాభూమి

అమీర్‌పై బిబిసి అనుచిత వ్యాఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 8: పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్‌పై బిబిసి చేసిన అనుచిత వ్యాఖ్య వివాదం రేపుతున్నది. ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లినప్పుడే, అప్పటి కెప్టెన్ సల్మాన్ బట్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్‌తో కలిసి అమీర్ కూడా ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. తన నేరాన్ని అంగీకరించిన అమీర్ ఇంగ్లాండ్‌లోనే జైలు శిక్షను అనుభవించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) తనపై విధించిన శిక్షా కాలాన్ని కూడా పూర్తి చేశాడు. అనంతరం మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అతను పాక్ జాతీయ జట్టులో సభ్యుడిగా ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చాడు. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌పై బిబిసి సమాచారాన్ని అందిస్తూ అమీర్‌ను ‘్ఫక్సర్’గా అభివర్ణించింది. కాగా, ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమీర్ పూర్తిగా మారిపోయాడని, చేసిన తప్పుకు శిక్షకూడా అనుభవించాడని ఇంగ్లాండ్ ఆటగాడు రవి బొపారా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అతనిని ఇంకా ‘్ఫక్సర్’ అంటూ పేర్కోవడం అన్యాయమని అన్నాడు. పాకిస్తాన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా అమీర్‌ను బిబిసి సంబోధించిన తీరును నిరసన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నుంచి అనుమతి పొందిన అతనిని ‘్ఫక్సర్’ అనడం బిబిసికి తగదని అన్నాడు.