క్రీడాభూమి

కిట్ లేకుండానే కిట్స్‌కు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ కిట్స్, జూలై 8: భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే తన క్రికెట్ సరంజామా (కిట్) లేకుండానే సెయింట్ కిట్స్‌కు చేరాడు. టీమిండియా సభ్యులతో కలిసి అతను ఇక్కడి విమానాశ్రయంలో దిగి, హోటల్ గదికి బయలుదేరినప్పుడు చూసుకుంటే కిట్ లేదన్న విషయం తెలిసింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ దానిని గాట్విక్‌లోనే వదిలివేసిందని సమాచారం అందింది. కుంబ్లేకు ఈ విషయాన్ని తెలిపేందుకు బ్రిటిష్ ఎయిర్‌వేస్ క్రికెట్ పరిభాషనే ఉపయోగించింది. కుంబ్లే కిట్‌ను ‘నాటౌట్’గా పేర్కొంది. గాట్విక్‌లోనే ‘కాట్ బిహైండ్’గా ఉండిపోయాయని తెలిపింది. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, త్వరలోనే కుంబ్లే ప్లేయింగ్ కిట్ వచ్చేస్తుందని తెలిపింది. ఇలావుంటే, క్రికెటర్ల కిట్స్ మాయం కావడం ఇదే మొదటిసారి కాదు. 1984లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జంషెడ్పూర్‌లో జరగాల్సిన వనే్డ మ్యాచ్ ఈ కారణంగానే రద్దయింది. ఆస్ట్రేలియా ఆటగాళ్ల దుస్తులున్న సూట్‌కేసులు కోల్‌కతాలోనే ఉండిపోగా, జంషెడ్పూర్ చేరుకున్న వారంతా ఎంతోసేపు ఎదుచూశారు. చివరికి అధికారులు మ్యాచ్‌ని రద్దు చేయాల్సి వచ్చింది. ఆసీస్ ఆటగాళ్ల కిట్స్‌ను ఎయిర్‌వేస్ అధికారులు రోడ్డు మార్గం ద్వారా కోల్‌కతా నుంచి జంషెడ్పూర్ పంపారు. ఇలాంటి సంఘటనలు కొత్తకాకపోయినా, కోచ్‌గా తొలి పర్యటనలో కుంబ్లేకు ఈ సమస్య ఎదురుకావడం ప్రత్యేకతను సంతరించుకుంది.