క్రీడాభూమి

భారత క్రికెటర్ల బీచ్ వాలీబాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ కిట్స్, జూలై 8: వెస్టిండీస్‌లో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లిన భారత క్రికెటర్లు అక్కడ బీచ్ వాలీబాల్‌లో తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. ఆటవిడుపుగా వారంతా బీచ్ వాలీబాల్ ఆడారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో ఉత్సాహంగా కనిపించగా, మిగతా వారు కూడా అతనితో జత కలిశారు. కరేబియాలోని అత్యంత సుందరమైన దీవుల్లో సెయింట్ కీట్స్ ఒకటి. దీనిని ‘సుగర్ సిటీ’గా పిలుస్తారు. ఈ ద్వీపానికి దక్షిణాన కరేబియన్ సముద్రం, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. టీమిండియా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం బీచ్‌లోనే గడుపుతున్నది. శనివారం నుంచి మొదటి వాపమ్ మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో, ఫిట్నెస్ కోసం క్రికెటర్లంతా బీచ్ వాలీబాల్ ఆడారు.

హోరాహోరీలో యు ముంబా గెలుపు
జైపూర్, జూలై 8: ప్రో కబడ్డీలో భాగంగా శుక్రవారం చివరి వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌పై యు ముంబా జట్టు ఒక పాయింట్ తేడాతో గెలిచింది. ఈ జట్టు 24 పరుగులు సాధించగా, పాట్నా 23 పరుగులు చేసింది. యు ముంబా తరఫున కెప్టెన్ అనూప్ కుమార్ అత్యధికంగా 11 పాయింట్లు చేసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాట్నా జట్టులో కెప్టెన్ సురేందర్ నాడా, రోహిత్ కుమార్ చెరి ఐదు పాయింట్లు చేశారు.
బెంగళూరును ఓడించిన పాట్నా: బెంగకాగా, మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌తో తలపడిన పాట్నా పైరేట్స్ జట్టు 35-21 పాయంట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మొత్తం 25 పా యంట్లతో పాట్నా జట్టు పాయంట్ల పట్టికలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది.