క్రీడాభూమి

ఫెదరర్‌కు రవోనిక్ కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ పోరాటానికి తెర
లండన్: వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో లియాండర్ పేస్, మార్టినా హింగిస్ మూడో రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించడంతో ఈ మెగా టోర్నీలో భారత్ పోరాటానికి తెరపడింది. హీతర్ వాట్సన్, హెన్రీ కొంటినెన్ జోడీ 3-6, 6-3, 6-2 తేడాతో పేస్, మార్టినా జోడీని ఓడించింది. మొదటి రెండు రౌండ్లలో బై లభించిన హీతర్, కొంటినెన్ మూడో రౌండ్‌లో తొలిసారి మ్యాచ్ ఆడారు. అందులో పేస్, మార్టినా వంటి అనుభవజ్ఞులను ఓడించి సత్తా చాటారు.

లండన్, జూలై 8: కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను గెల్చుకున్న మాజీ ప్రపంచ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ దూకుడుకు మిలోస్ రవోనిక్ కళ్లెం వేశాడు. శుక్రవారం జరిగిన వింబ్లుడన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో అతను ఫెదరర్‌ను 6-3, 6-7, 4-6, 7-5, 6-3 తేడాతో ఓడించి ఫైనల్ చేరాడు. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన ఫెదరర్ అనూహ్యంగా నిష్క్రమించగా, రవోనిక్ తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను సాధించేందుకు మరో విజయం దూరంలో నిలిచాడు. కెరీర్‌లో మొట్టమొదటిసారి ఒక గ్రాండ్ శ్లామ్ ఫైనల్ చేరిన రవోనిక్ సెమీఫైనల్‌లో శామ్ క్వెర్రీని ఓడించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్‌ను ఓడించిన క్వెర్రీని ఇంటిదారి పట్టించడంతో రవోనిక్‌కు ‘జెయింట్ కిల్లర్’గా ముద్ర పడింది. అయితే, అంతర్జాతీయ టెన్నిస్‌లో అపారమైన అనుభవం ఉన్న ఫెదరర్‌ను అతను సమర్థంగా ఎదుర్కోగలడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందరి అంచనాలను తారుమారు చేస్తూ రవోనిక్ మొదటి సెట్‌ను గెల్చుకోవడంతో, ఫెదరర్ ఎలాంటి పోటీనివ్వకుండానే వెనుదిరుగుతాడేమోనని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, తర్వాత వరుసగా రెండు సెట్లలో రవోనిక్ విఫలంకాగా, ఫెదరర్ వాటిని కైవసం చేసుకొని ఆధిక్యంలోకి వెళ్లాడు. మరో సెట్‌ను కోల్పోతే పోరు నుంచి నిష్క్రమించడం ఖాయంకాగా, రవోనిక్ ఎదురుదాడికి దిగాడు. ఫలితంగా నాలుగో సెట్ అతని వశమైంది. దీనితో చివరిదైన ఐదో సెట్ కీలకంగా మారింది. కెరీర్‌లో 18వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించాలన్న పట్టుదలతో ఆడిన ఫెదరర్‌పై రవోనిక్ సమర్థంగా ఒత్తిడిని పెంచగలిగాడు. మారిన్ సిలిక్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో మొదటి రెండు సెట్లు ఓడి, మూడో సెట్ ఆరంభంలో వెనుకబడినప్పటికీ, ఆతర్వాత ఎదురుదాడి చేసి ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించిన ఫెదరర్ అదే స్థాయిలో రవోనిక్‌పై విరుచుకుపడతాడని అభిమానులు ఆశించారు. కానీ, వారి అంచనాలు తారుమారుకాగా, ఫెదరర్ గొప్ప పోటీ ఇవ్వకుండానే ఓటమిపాలై నిష్క్రమించాడు. ఏడు పర్యాయాలు వింబుల్డన్ విజేతగా నిలిచిన అతను సెమీఫైనల్ దశలో ఓడడం ఇదే మొదటిసారి. మొత్తం మీద గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో అతను ఈ విధంగా సెమీస్ నుంచి వెనుదిరిగడం ఇది 13వసారి. ఆస్ట్రేలియా ఓపెన్‌లో అత్యధికంగా ఏడుసార్లు సెమీస్‌లో ఓడాడు. ఫ్రెండ్ ఓపెన్‌లో రెండుసార్లు, యుఎస్ ఓపెన్‌లో మూడు పర్యాయాలు సెమీస్ నుంచి వెనుదిరిగాడు. వింబుల్డన్‌లో మొదటిసారి అతను సెమీస్‌లో పరాజయాన్ని ఎదుర్కొని, కెరీర్‌లో మరో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌పై వెట్టుకున్న ఆశలను వమ్ము చేసుకున్నాడు.
నేడు మహిళల ఫైనల్
ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్, ఏంజెలిక్ కెర్బర్ మధ్య వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ శనివారం జరగనుంది. వీరిద్దరూ స్ట్ఫె గ్రాఫ్ రికార్డుల పైనే దృష్టి పెట్టడం గమనార్హం. స్ట్ఫె 22 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకోగా, ఇప్పటి వరకూ 21 టైటిళ్లను సాధించిన సెరెనా ఆమె సరసన స్థానం కోసం ప్రయత్నించనుంది. కాగా, స్ట్ఫె తర్వాత వింబుల్డన్ టైటిల్‌ను సాధించిన మొదటి జర్మన్ క్రీడాకారిణిగా రికార్డు పుస్తకాల్లో చోటు కోసం కెర్బర్ పట్టుదలతో ఉంది. ఇరువురి ఫామ్‌ను, అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే, సెరెనాకే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, కెర్బర్‌ను తక్కువ అంచనా వేస్తే తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ ఆరు పర్యాయాలు విజేతగా నిలిచిన సెరెనా ఈసారి మొదటి నాలుగు రౌండ్లలో వరుసగా అమ్రా సాడికొవిచ్, క్రిస్టినా మెక్‌హాలె, అన్నికా బెక్, స్వెత్లానా కుజ్నెత్సొవాలను ఓడించింది. క్వార్టర్ ఫైనల్‌లో అనస్తాసియా పవ్లిచెన్కొవాపై గెలిచింది. సెమీస్‌లో ఎలెనా వస్నినాపై విజయం సాధించి ఫైనల్ చేరింది. అదే విధంగా కెర్బర్ మొదటి నాలుగు రౌండ్లలో వరుసగా లారా రాబ్సన్, వర్వరా లెప్చెన్కొ, కరినీ వితాఫ్ట్, మిసాకీ డోయ్‌లపై నెగ్గింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సిమోనా హాలెప్‌ను ఓడించింది. సెమీ ఫైనల్‌లో టైటిల్ రేసులోవున్న వీనస్ విలియమ్స్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసి ఫైనల్ చేరింది. కెర్బర్‌కు టైటిల్ గెలిచే అవకాశాలు ఎలావున్నా, సెరెనాకు గట్టిపోటీనివ్వడం ఖాయం.