క్రీడాభూమి

వచ్చే ఏడాది మళ్లీ వస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 9: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో మిలోస్ రవోనిక్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన సీనియర్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ వచ్చే ఏడాది ఈటోర్నీకి మళ్లీ వస్తానని, టైటిల్‌ను సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వచ్చే ఏడాది కూడా సెంటర్ కోర్టులో మ్యాచ్ ఆడాలన్నదే తన లక్ష్యమని అన్నాడు. తనకు చాలా చిరపరచితమైన వింబుల్డన్‌లో ప్రేక్షకుల అభిమానాన్ని మొదటి నుంచి తాను పొందానని అన్నాడు. వారికి ఎప్పుడూ కృతజ్ఞడిగానే ఉంటానని చెప్పాడు. ఒకవేళ ఫైనల్ చేరి ఉంటే, 1974లో జినీ కానర్స్ తర్వాత వింబుల్డన్ టైటిల్ పోరులో ఆడిన ఎక్కువ వయసుగల ఆటగాడిగా ఫెదరర్ పేరు రికార్డు పుస్తకాల్లో చేరేది. 39 ఏళ్ల వయసులో కెన్ రోజ్‌వాల్ వింబుల్డన్ ఫైనల్‌కు చేరి, జిమీ కానర్స్ చేతిలో ఓడాడు. ఈ విషయాన్ని ప్రస్తావించగా, వయసు గురించి తాను ఆలోచించడం లేదని ఫెదరర్ అన్నాడు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. కెరీర్‌ను కొనసాగిస్తానని స్పష్టం చేశాడు.