క్రీడాభూమి

రియో ఒలింపిక్స్‌కు బోల్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, జూలై 9: ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్‌లో 100, 200 మీటర్ల పరుగుతోపాటు 400 మీటర్ల రిలే టైటిల్‌ను కూడా సాధించాలన్న ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమైకా నిబంధనల ప్రకారం ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొని అతను అర్హత సంపాదించాలి. కానీ, 100 మీటర్ల స్ప్రింట్‌లో పరిగెడుతున్నప్పుడు కాలి కండరాలు బెణకడంతో అతను క్వాలిఫయర్స్ నుంచి వైదొలిగాడు. అనారోగ్యం లేది ఇతరత్రా బలమైన కారణాలవల్ల క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో పాల్గొనకపోయినా ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కల్పించే అధికారం జమైకా అథ్లెటిక్స్ పాలనా సంఘం (జెఎఎఎ)కు ఉంది. ఒలింపిక్స్, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా కొనసాగుతున్న బోల్ట్‌ను రియో ఒలింపిక్స్‌కు వెళ్లే బృందంలో చేర్చాలని జెఎఎఎ నిర్ణయించినట్టు స్థానిక వార్తా పత్రికల కథనం. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ, బోల్ట్‌కు సానుకూలంగా సంఘం కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించిందని తెలుస్తోంది. బోల్ట్ ప్రస్తుతం జర్మనీలో వైద్య సేవలు పొందుతున్నాడు. అతను ఈనెల 22న జరిగే లండన్ వార్షిక గేమ్స్ అత్లెటిక్స్ పోటీలో పాల్గొంటాడు. రియోకు ముందు ఫిట్నెస్‌ను నిరూపించుకోవడానికి లండన్‌ను అతను వేదికగా భావిస్తున్నాడు.