క్రీడాభూమి

వింబుల్డన్ క్వీన్ సెరెనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 9: ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ వింబుల్డన్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్‌లో ఏంజెలిక్ కెర్బర్‌ను ఓడించి, కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను గెల్చుకొని, అత్యధిక విజయాల జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్న స్ట్ఫె గ్రాఫ్ సరసన చేరాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన సెరెనా తన లక్ష్య సాధనకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకపోయింది. 7-5, 6-3 తేడాతో సునాయాసంగా గెలిచిన ఆమె ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో కెర్బర్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. పంతాన్ని నెగ్గించుకుంది. 34 ఏళ్ల ఈ అమెరికా క్రీడాకారిణి తన ఫైనల్ ప్రత్యర్థి కెర్బర్‌తో తలపడడం ఇది ఎనిమిదోసారి. విజయం సాధించడం ఆరోసారి. 28 ఏళ్ల కెర్బర్ కెరీర్‌లో తొమ్మిది టైటిళ్లు సాధిస్తే, సెరెనా ఖాతాలో 71వ టైటిల్ చేరింది. వింబుల్డన్‌లో సెరెనా ఏడో పర్యాయం విజేతగా నిలిచింది. కాగా, మొదటిసారి వింబుల్డన్ ఫైనల్ చేరుకున్న కెర్బర్ ఈఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాదిరిగానే సెరెనాను ఓడించేందుకు అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకుంది. దీనితో ఇరువురి మధ్య హోరాహోరీ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఫైనల్ పోరు అందుకు భిన్నంగా సాగింది. మొదటి సెట్‌లో కొంత వరకు పోరాడిన కెర్బర్ రెండో సెట్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఈటోర్నీలో సెరెనా 61 ఏస్‌లతో ముందంజలో ఉండగా, కెర్బర్ 11 ఏస్‌లకు పరిమితం కావడం మ్యాచ్ ఫలితం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ముందుగానే స్పష్టం చేసింది. సెరెనాకే టైటిల్ దక్కుతుందన్న వాదన మొదటి నుంచి బలంగా వినిపించడానికి ఇది కూడా ఒక కారణం. గంటకు 123 కిలోమీటర్ల వేగంతో సర్వీస్ చేసిన సెరెనాకు దీటుగా కెర్బర్ సర్వీస్ చేయలేకపోయింది. ఫైనల్‌లోనూ బలమైన సర్వీస్‌ల
విషయంలో సెరెనానే ముందంజలో నిలిచింది. సులభంగా గెలిచి టైటిల్ అందుకుంది.
కార్నర్‌స్టోన్‌లో సెరెనా తిరుగులేని ప్రతిభ కనబరచింది. కెరీర్ ఆరంభం నుంచి అదే ఆమె బలం. ఆమె మొదటి సర్వీస్‌ను చాలా వేగంగా దూసుకొస్తుంది. దానిని తిప్పికొట్టడానికి ప్రత్యర్థులు నానా ఇబ్బందులు పడతారు. ఫైనల్‌లో కెర్బర్‌కు సెరెనా తన పవర్‌ప్లే బలం ఏమిటో నిరూపించింది. సెరెనా అంత బలంగా సర్వీస్‌లు చేయలేకపోయినా, ఎంత వేగంగా దూసుకొచ్చే బంతినైనా సమర్థంగా తిప్పికొట్టడంలో కెర్బర్ దిట్ట. ఆ బలమే సెరెనాకు తీవ్ర స్థాయిలో పోటీనిచ్చే స్థితిలో నిలబెట్టింది. కానీ, తుది పోరులో ఆమె ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. రికార్డు టైటిల్‌పై కనే్నసిన సెరెనా తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విరుచుకుపడి, తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఓపెన్ ఎరాలో స్ట్ఫె గ్రాఫ్ 22 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకొని, ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవగా, ఆ రికార్డు కోసం సెరెనా తీవ్రంగా కృషి చేసింది. ఈఏడాది జరిగిన తొలి గ్రాండ్ శ్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆమె ఫైనల్ చేరినప్పటికీ, కెర్బర్ చేతిలో 4-6, 6-3, 4-6 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నా గార్బినె ముగురుజా చేతిలో 5-7, 4-6 తేడాతో ఓడింది. వింబుల్డన్‌లో ఫైనల్ చేరడం సెరెనా సామర్థ్యానికి అద్దం పడుతుంది. గ్రాండ్ శ్లామ్ ఫైనల్స్‌లో హ్యాట్రిక్ పరాజయాలను చవిచూడకుండా ఉండేందుకు సెరెనా సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. అందుకే కెర్బర్‌ను ఓడించడంలో ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. గ్రాండ్ శ్లామ్ టైటిళ్ల ఆల్‌టైమ్ రికార్డు 24 పర్యాయాలు విజేతగా నిలిచిన మార్గరెట్ కోర్ట్ పేరుమీద ఉంది. ఆమె రికార్డును చేరుకోవడానికి స్ట్ఫె మరో రెండు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను గెల్చుకోవాల్సి ఉంది.
ఈసారి వింబుల్డన్‌సహా సెరెనా 28 పర్యాయాలు గ్రాండ్ శ్లామ్ ఫైనల్స్ చేరగా ఆరుసార్లు మాత్రమే ఓటమిపాలైంది. 2001 ఆస్ట్రేలియా ఓపెన్‌లో తన సోదరి వీసన్ విలియమ్స్ చేతిలో ఆమె పరాజయాన్ని చవిచూసింది. 2004 వింబుల్డన్ ఫైనల్‌లో మరియా షరపోవా, 2008 వింబుల్డన్ ఫైనల్‌లో వీనస్ విలియమ్స్, 2011 యుఎస్ ఓపెన్‌లో సమంతా స్టొసుర్, ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఏంజెలిక్ కెర్బర్ చేతిలో పరాజయాలను చవిచూసింది. ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఫైనల్ చేరి గార్బినే ముగురుజా చేతిలో 5-7, 4-6 తేడాతో మ్యాచ్‌ని కోల్పోయింది. కెర్బర్‌ను ఓడించడం ద్వారా పరజయాల హ్యాట్రిక్ ఎదురయ్యే ప్రమాదం నుంచి బయటపడింది.

చిత్రం.. ఏడోసారి వింబుల్డన్ టైటిల్ సాధించిన సెరెనా