క్రీడాభూమి

వింబుల్డన్‌లో సెరెనా, కెర్బర్ ప్రస్థానం సాగిన విధానం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెరెనా: మొదటి రౌండ్‌లో అమ్రా సాడికొవిచ్‌పై (6-2, 6-4), రెండో రౌండ్‌లో క్రిస్టినా మెక్‌హాలెపై 7-6, 6-2, 6-4, మూడో రౌండ్‌లో అనికా బెక్‌పై 6-3, 6-0, నాలుగో రౌండ్‌లో స్వెత్లానా కుజ్సెత్సొవాపై 7-5, 6-0 తేడాతో విజయాలను నమోదు చేసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో అనస్తాసియా పవ్లిచెన్కొవాను 6-4, 6-4 ఆధిక్యంతో ఓడించింది. సెమీఫైనల్‌లో ఎలెవెనా వెస్నినాపై 6-2, 6-0 తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్‌లో కెర్బర్‌ను ఓడించి టైటిల్ సాధించింది.
కెర్బర్: మొదటి రౌండ్‌లో లారా రాబ్సన్‌ను 6-3, 6-2, రెండో రౌండ్‌లో వర్వరా లెప్చెన్కోవాను 6-1, 6-4, మూడో రౌండ్‌లో కరినా వితాఫ్‌ను 7-6, 6-1, నాలుగో రౌండ్‌లో మిసాకీ డోయ్‌ను 6-3, 6-1 ఆధిక్యంతో ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సిమోనా హాలెప్‌పై 7-5, 7-6 తేడాతో గెలిచింది. సెమీఫైనల్‌లో టైటిల్ ఫేవరిట్స్‌లో ఒకరైన వీనస్ విలియమ్స్‌ను 6-4, 6-4 స్కోరుతో చిత్తుచేసింది. ఫైనల్‌లో సెరెనా చేతిలో ఓటమిపాలై, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది.
**
సెరెనా 21వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించే సమయానికి ఆమె వయసు 33 సంవత్సరాలా 285 రోజులు. ఇప్పుడు వింబుల్డన్ ఫైనల్‌లో కెర్బర్‌ను ఓడించే సమయానికి ఆమె వయసు 34 సంవత్సరాల 283 రోజులు. మార్టినా నవ్రతిలోవా 1990లో వింబుల్డన్ టైటిల్‌ను తన 33వ ఏట సాధించింది. 1994లో ఆమె మరోసారి వింబుల్డన్ ఫైనల్ చేరింది. అయితే, కొంచితా మార్టినెజ్ చేతిలో 4-6, 6-3, 3-6 తేడాతో ఓడింది. కాగా, గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకున్న ఎక్కువ వయసుగల క్రీడాకారిణిగా నవ్రతిలోవా పేరుమీద ఉన్న రికార్డును ఇప్పుడు సెరెనా బద్దలు చేసింది.
**
స్ట్ఫె గ్రాఫ్ 1996లో చివరిసారి వింబుల్డన్ టైటిల్‌ను సాధించింది. ఆమె తర్వాత ఈ మెగా టోర్నీలో ఫైనల్ చేరిన తొలి జర్మనీ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పే అవకాశం కెర్బర్‌కు లభించింది. 1996 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో చేరడానికి స్ట్ఫె వివిధ దేశాలకు చెందిన ఐదుగురు క్రీడాకారిణులను ఓడించగా, ఆమె మాదిరిగానే కెర్బర్ కూడా ఈసారి వింబుల్డన్ ఫైనల్‌లో అడుగుపెట్టడానికి వేర్వేరు దేశాలకు చెందిన క్రీడాకారిణులపై నెగ్గింది. అప్పట్లో అరంటా సాంచెజ్ వికారియోను స్ట్ఫె ఓడించింది. ఆదే స్థాయిలో సెరెనాపై గెలవడం ద్వారా టైటిల్ సాధించాలన్న కెర్బర్ ఆశలు ఫలించలేదు.
ఒక టోర్నీలో ‘నల్ల కలువలు’ వీనస్, సెరెనా విలియమ్స్‌ను ఓడించిన ఘనత ఇప్పటి వరకు ఎనిమిది మందికి దక్కింది. ఆ జాబితాలో చేరే అవకాశం కెర్బర్‌కు లభించలేదు. సెరెనాను ఓడించి ఉంటే కెర్బర్ ఖాతాలో చాలానే రికార్డులు చేరేవి. కానీ, పలు రికార్డులతోపాటు కెరీర్‌లో మొదటి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకునే అవకాశాన్ని కూడా ఆమె చేజార్చుకుంది.
**
కెరీర్‌లో మొదటిసారి వింబుల్డన్ ఫైనల్ చేరి, టైటిల్ పోరులో సెరెనా చేతిలో ఓడిన జర్మనీ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్. ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెరెనాను ఓడించిన ఆమె వింబుల్డన్‌లో అదే ఫలితాన్ని రాబట్టలేక పోయంది.