క్రీడాభూమి

ఏడు పదుల పీలేకి మళ్లీ పెళ్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సావో పౌలో, జూలై 10: ‘సాకర్ లెజెండ్’ పీలే మళ్లీ పెళ్లికొడుకు కానున్నాడు. 75 ఏళ్ల పీలే ఆరేళ్లుగా తనకు సన్నిహితంగా ఉంటున్న మార్సియా సిబెల్ ఆకోని వివాహం చేసుకోనున్నట్టు స్థానిక పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. 1980 దశకం ఆరంభంలో న్యూయార్క్‌లో అకోను పీలే చూశాడు. అయితే, వీరిద్దరూ 2010 వరకు మళ్లీ కలుసుకోలేదు. 42 ఏళ్ల అకో వ్యాపారంలో మునిగితేలుతుండగా, మూడు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్ ట్రోఫీలను స్వీకరించిన పీలే పలు సామాజిక, ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. సుకర్ అభివృద్ధికి అతను విశేషంగా కృషి చేస్తున్నాడు. 2012 తర్వాత పీలే ఎక్కడ, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అకో అతని పక్కనే కనిపిస్తున్నది. పీలేను వెన్నంటే ఉంటూ, అతని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నది. ఇటీవల పీలే ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు అతని దగ్గరే ఉండి సపర్యలు చేసింది. చాలాకాలంగా తనతో ఉంటున్న అకోను వివాహం చేసుకోవాలని పీలే నిర్ణయించినట్టు సమాచారం. పీలే కెరీర్‌లో 1,363 మ్యాచ్‌లు ఆడి, 1,281 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరపున 91 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు.