క్రీడాభూమి

ఒలింపిక్ క్వాలిఫయర్‌లో కృష్ణ పునియా విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడంలో భారత డిస్కస్ త్రోయర్ కృష్ణ పునియా విఫలమైంది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన క్వాలిఫయర్స్‌లో పోడీపడిన ఆమె డిస్కస్‌ను 59.49 మీటర్ల దూరానికి విసరగలిగింది. ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు కనీస ప్రమాణం 61 మీటర్లు. 2010 ఢిల్లీ కామనె్వల్త్ గేమ్స్‌లో 61.51 మీటర్ల దూరానికి విసిరి, స్వర్ణ పతకం సాధించిన పునియా 2012లో 64.76 మీటర్ల దూరంతో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. ఇప్పటి వరకూ ఆ రికార్డును ఎవరూ అధిగమించలేదు. కామనె్వల్త్ గేమ్స్ అథ్లెటిక్స్ ఇండివిజువల్ ఈవెంట్‌లో టైటిల్ సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన పునియా తన స్థాయికి తగినట్టు రాణించలేక, ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించలేకపోయింది.