క్రీడాభూమి

బ్రిటిష్ ఫార్ములా వన్ రేస్ విజేత హామిల్టన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిల్వర్‌స్టోన్, జూలై 10: బ్రిటిష్ ఫార్ములా వన్ రేస్‌ను లూయిస్ హామిల్టన్ గెల్చుకున్నాడు. అతను ఈరేస్‌ను గెల్చుకోవడం ఇది నాలుగోసారి. గతంలో నాలుగు పర్యాయాలు టైటిల్ సాధించిన బ్రిటిషర్‌గా నిజెల్ మానె్సల్ నెలకొల్పిన రికార్డును హామిల్టన్ సమం చేశాడు. మొత్తం మీద సిల్వర్‌స్టోన్‌లో జిమ్ క్లార్క్ ఐదు సార్లు గెలిచాడు. ఆ రికార్డుకు హామిల్టన్ మరో విజయం దూరంలో ఉన్నాడు. మెర్సిడిజ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను తన జట్టుకే చెందిన నికో రోజ్‌బర్గ్ నుంచి ఎదురైన గట్టిపోటీని తట్టుకొని నిలబడ్డాడు. రేస్‌ను సమర్థంగా పూర్తి చేయగా, రోజ్‌బర్గ్‌కు ద్వితీయ స్థానం దక్కింది. రెడ్ బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాఫెన్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. కాగా, ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, నికో హకెల్‌బర్గ్ వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నారు.