క్రీడాభూమి

సెరెనాకు డబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సెరెనా డబుల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచింది. తన సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సెరెనా ఫైనల్‌లో టిమియా బబోస్ (హంగరీ), యారొస్లావ ష్వెడోవా (కజకస్థాన్) జోడీని 6-3, 6-4 తేడాతో చిత్తుచేసింది. సెరెనా, వీనస్ జోడీకి వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగంలో ఇది ఆరో టైటిల్. 1999 సాన్ డియాగో టోర్నీ తర్వాత వీనస్, సెరెనా జోడీ ఇప్పటి వరకూ డబుల్స్ ఫైనల్స్‌లో ఎన్నడూ పరాజయాన్ని చవిచూడలేదు. వచ్చేనెల జరగనున్న రియో ఒలింపిక్స్‌లోనూ వీరు డబుల్స్ విభాగంలో కలిసి ఆడతారు.
హింస ఆందోళన కలిగిస్తున్నది..
అమెరికాలో చెలరేగిన హింస ఆందోళన కలిగిస్తున్నదని కెరీర్‌లో ఏడోసారి వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సెరెనా విలియమ్స్ చెప్పింది. డబుల్స్ విభాగంలో తన సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి టైటిల్ సాధించిన ఆమె విలేఖరులతో మాట్లాడుతూ అమెరికాలో గన్ కల్చర్ పెరగడం ఆందోళనను పెంచుతున్నదని, తన సన్నిహితులు, బంధువులు చాలా మంది భద్రతపై భయపడుతున్నానని చెప్పింది. వారిని బయటకు వెళ్లవద్దని సూచించానని తెలిపింది. నల్లజాతీయులపై శే్వతజాతీయుల దాడులకు ప్రతీకారంగా డల్లాస్‌లో 25 ఏళ్ల మికా జేవియర్ జాన్సన్ దాడి చేసి, ఐదుగురు పోలీస్ అధికారులను కాల్చి చంపిన సంఘటన సంచలనం రేపింది. లాసనే్నలో అల్టన్ స్టెర్లింగ్‌ను, మినెసొటాలో ఫిలాండో కాస్టిల్‌ను శే్వతజాతీయులైన పోలీసులు హతమార్చిన తర్వాత అమెరికాలోని పలు ప్రాంతాల్లో నల్లజాతీయులు నిరసనలకు దిగుతున్నారు. ఈ ఘర్షణలు అమెరికాను అతలాకుతలం చేస్తుండగా, తాజా పరిస్థితులపై సెరెనా భయాందోళనలు వ్యక్తం చేసింది. డల్లాస్ కాల్పుల సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. జాతి ఏదైనా ఎవరూ ఇలా ప్రాణాలు కోల్పోకూడదని పేర్కొంది. మనమంతా మనుషులమేనన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పింది. అమెరికాలో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావం వ్యక్తం చేసింది.

వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో గెలిచిన సెరెనా, వీనస్