క్రీడాభూమి

సిఎఎస్ నిర్ణయంలో జాప్యం షరపోవాకు నిరాశే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసనే్న, జూలై 11: మాల్డోనియం ఉత్ప్రేరకాన్ని వినియోగించినట్టు అంగీకరించి, రెండేళ్ల సస్పెన్షన్‌కు గురైన రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడం అనుమానంగానే ఉంది. తనపై విధించిన సస్పెన్షన్ కేసును రద్దు చేయాలంటూ అంతర్జాతీయ క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్)ను షరపోవా ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, రియోలో పాల్గొనే విషయాన్ని ఖరారు చేయాల్సిన తేదీ సమీపిస్తున్నప్పటికీ సిఎఎస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తీర్పును సెప్టెంబర్ వరకూ వాయిదా వేసినట్టు సమాచారం. సిఎఎస్ చేస్తున్న జాప్యంతో షరపోవాకు నిరశ తప్పని పరిస్థితి నెలకొంది.