క్రీడాభూమి

షమీకి రూ. 2.23 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 11: మోకాలి నొప్పి కారణంగా నిరుడు ఐపిల్‌లో ఆడలేకపోయిన భారత పేసర్ మహమ్మద్ షమీకి నష్టపరిహారం కింద 2.2 కోట్ల రూపాయలు చెల్లించినట్టు బిసిసిఐ వెల్లడించింది. 25 లక్షలు లేదా అంతకు మించి జరిపిన చెల్లింపుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఇది వరకే ప్రకటించిన బిసిసిఐ జూన్ మాసపు లెక్కలను వెల్లడించింది. నిరుడు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్, ఆ వెంటనే జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో షమీ ఆడాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నప్పటికీ, వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్‌లో జట్టుకు తన అవసరం ఉందన్న ఉద్దేశంతో అతను మ్యాచ్‌లు ఆడాడు. టీమిండియా సెమీ ఫైనల్ చేరడంతో అతను కీలక భూమిక పోషించాడు. అయితే, మోకాలి నొప్పి తీవ్రం కావడంతో, వరల్డ్ కప్ ముగిసిన వెంటనే అతను శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా 2015 ఐపిఎల్‌లో ఆడలేకపోయాడు. జాతీయ జట్టుకు సేవలు అందించేడానికి మోకాలి నొప్పిని ఖాతరు చేయకుండా ఆడిన షమీకి 2,23,12,500 రూపాయల నష్టపరిహారం చెల్లించినట్టు బిసిసిఐ పేర్కొంది. అధికారులకు ఫీజు చెల్లింపుల కింద మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్, మాజీ స్పిన్నర్ అనంతపద్మనాభన్‌లకు చెరి 26 లక్షల రూపాయలు ఇచ్చినట్టు తెలిపింది.

చిత్రం.. మహమ్మద్ షమీ