క్రీడాభూమి

షాన్ మార్ష్‌కు ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 25: మెల్బోర్న్‌లో వెస్టిండీస్‌తో జరిగే బాక్సింగ్‌డే (26వతేదీ) నుంచి జరగనున్న రెండో టెస్టుకు ఉస్మాన్ ఖావాజా తిరిగి జట్టులోకి రావడం కోసం ఆస్ట్రేలియా సెలెక్టర్లు షాన్ మార్ష్‌ను జట్టులోంచి తొలగించారు. హోబర్ట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో మార్ష్ టెస్ట్‌మ్యాచ్‌లలో తన అత్యధిక స్కోరు అయిన 182 పరుగులను సాధించిన విషయం తెలిసిందే. ఈ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 212 పరుగులతో వెస్టిండీస్‌ను చిత్తు చేయడం తెలిసిందే. అయినప్పటికీ మార్ష్‌కు జట్టులో స్థానం దొరక్క పోవడం గమనార్హం. గాయం కారణంగా గత రెండు టెస్టులకు దూరంగా ఉన్న ఖావాజా మళ్లీ జట్టులోకి రావడమే కాకుండా నంబర్ 3 స్థానాన్ని తిరిగి దక్కించుకోవడమే దీనికి కారణం. గాయంనుంచి కోలుకొన్న తర్వాత అతను గత వారాంతంలో జరిగిన బిగ్‌బాష్ లీగ్ టి-20 సిరీస్‌లో 70 బంతుల్లో 109 పరుగులు చేయడం ద్వారా తన ఫిట్నెస్‌ను నిరూపించుకున్నాడు. అదే గనుక జరిగి ఱండకపోయి ఉంటే మెల్బోర్న్ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టులో ఎలాంటి మార్పూ ఉండేది కాదు. అయితే ఖావాజా గాయంనుంచి పూర్తిగా కోలుకోవడంతో మార్ష్, ఓపెనర్ జో బర్న్‌లలో ఎవరిని తప్పించాలనే సమస్య సెలెక్టర్లకు ఎదురైంది. అయితే ఓపెనర్‌గా బర్న్ చక్కగా రాణిస్తూ ఉండడంతో సెలెక్టర్లు అతడి వైపే మొగ్గు చూపారు.
బర్న్, డేవిడ్ వార్నర్‌లు ఓపెనింగ్ జంటగా ప్రతి ఇన్నింగ్స్‌లోను చక్కగా రాణిస్తున్నారని, అందువల్ల వారిని మార్చాలని అనుకోలేదని జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పాడు.