క్రీడాభూమి

యూరో చాంప్ పోర్చుగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూలై 11: పోర్చుగల్ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కల నెరవేరింది. రెండు దశాబ్దాల నిరీక్షణ తర్వాత పోర్చుగల్ మొట్టమొదటి మేజర్ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫ్రాన్స్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక యూరో 2016 ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్ అనివార్యమయ్యే పరిస్థితులు నెలకొనగా, చివరి క్షణాల్లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు ఎడర్ చేసిన కీలక గోల్ పోర్చుగల్‌ను చాంపియన్‌గా నిలబెట్టింది. స్వదేశంలో ఫ్రెంచ్ ఆటగాళ్లు ఓటమిపాలు కావడానికి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కొంత మంది స్టేడియంలో సీట్లను విరగ్గొట్టి రాద్ధాంతం సృష్టిస్తే, మరికొంత మంది కొన్ని సీట్లకు నిప్పుపెట్టారు. స్టేడియం వెలుపల కూడా నిరసనకారులు రెచ్చిపోయారు. వారంతా విధ్వంసానికి పాల్పడడంతో, భద్రతాధికారులు రంగంలోకి దిగి, అతి కష్టం మీద వారిని చెల్లాచెదురు చేశారు.
ఈసారి యూరో చాంపియన్‌షిప్‌లో దాదాపుగా అన్ని జట్లు మితిమీరిన రక్షణాత్మక విధానాన్ని అనుసరించి ప్రేక్షకులను నిరాశ పరిచాయి. తుది పోరు వాటికి భిన్నంగా సాగుతుందని, పోర్చుగల్, ఫ్రాన్స్ ఆటగాళ్లు ఒకరి గోల్ పోస్టులపై మరొకరు దాడులకు దిగుతారని అభిమానులు ఆశించారు. కానీ, ఫైనల్‌లోనూ అదే దృశ్యం పునరావృతమైంది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న లక్ష్యంతో ఆడిన ఇరు జట్లు డిఫెన్స్‌కు పరిమితమయ్యాయి. రెండు జట్లలోనూ చాలా తక్కువ సందర్భాల్లో గోల్స్ కోసం జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రథామర్ధం ఒక్క గోల్ కూడా నమోదు కాకుండానే ముగియడంతో ద్వితీయార్ధంలోనైనా ఆటతీరు మారుతుందని ప్రేక్షకులు ఆశించారు. కానీ, మరోసారి ఇరు జట్ల ఆటగాళ్లు వారి ఆశలపై నీళ్లు చల్లారు. స్వదేశంలో, వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో ఆడుతున్న ఫ్రెంచ్ ఆటగాళ్లు హోం గ్రౌండ్ అడ్వెంటేజ్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఒక్కో నిమిషం గడుస్తున్న కొద్దీ అభిమానుల్లో ఆందోళన పెరిగింది. కానీ ఫ్రాన్స్ ఆటతీరు మాత్రం ఏమాత్రం మారలేదు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. ఇంజురీ టైమ్‌లోనూ గోల్స్ నమోదు కాలేదు. మ్యాచ్ ఫలితాన్ని తేల్చిందుకు వీలుగా ఎక్‌స్ట్రా టైమ్‌ను ప్రకటించారు. అప్పుడు కూడా కొంత సేపు మితిమిరీన డిఫెన్స్ విధానం కొనసాగింది. చివరికి ఈ మ్యాచ్ కూడా పెనాల్టీ షూటౌట్‌గానే ముగుస్తుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, 109వ నిమిషంలో ఎడర్‌గా సుపరచితుడైన ఎడర్జిటో ఆంటోనియో మాసెడో లోపెజ్ గోల్ చేయడంతో పోర్చుగల్ ఊపిరి పీల్చుకుంది. ప్రత్యర్థి ఇచ్చిన షాక్ నుంచి తేరుకొని ఫ్రెంచ్ ఆటగాళ్లు ఎదురుదాడికి దిగే సమయానికి ఎక్‌స్ట్రా టైమ్ ముగిసింది. పోర్చుగల్ 1-0 తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించి యూరో చాంపియన్‌గా నిలిచింది.

చిత్రం.. ఎడర్