క్రీడాభూమి

ఐఫెల్ టవర్ మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్: పోర్చుగల్‌తో జరిగిన యూరో సాకర్ 2016 ఫైనల్‌లో ఫ్రాన్స్ ఓడిన తర్వాత తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఐఫెల్ టవర్‌ను మూసేశారు. ఒక రోజు సందర్శకులు ఎవరినీ అనుమతించలేదు. ఫ్రాన్స్ ఓడిన వెంటనే అల్లరి మూకలు స్టేడియంలోనూ, వెలుపలా గలభా సృష్టించాయ. ఐఫెల్ టవర్ సమీపంలో ఏర్పాటు చేసిన జెయింట్ స్క్రీన్‌పై మ్యాచ్‌ని తిలకించిన వేలాది మంది అభిమానులు ఈ ఫలితం వెలువడిన వెంటనే ఆగ్రహం పట్టలేక కనిపించిన ప్రతి వస్తువునూ దగ్ధం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఐఫిల్ టవర్ సందర్శనను ఒక రోజు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ ప్రసిద్ధ కట్టడాన్ని చూసేందుకు రోజుకు సుమారు 20,000 మంది సందర్శకులు వస్తారు. వీరిలో విదేశీయులే ఎక్కువ.