క్రీడాభూమి

నేడు షారుఖ్ చేతుల మీదుగా సానియా పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: హైదరాబాదీ టెన్నిస్ తార సానియా మీర్జా తన జీవితంపై ‘ఏస్ అగైనెస్ట్ ఆడ్స్’ పేరుతో రాసిన పుస్తకాన్ని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ బుధవారం ఇక్కడ లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. వాస్తవానికి వారం రోజుల క్రితమే మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకంలో సానియా జీవితానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలు, ఆమె సాధించిన విజయాలు ఉన్నాయని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా చెప్పారు. ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన సానియాదేనని, పుస్తకం పూర్తి కావడానికి అయిదేళ్లు పట్టిందని పుస్తక రచనలో కుమార్తెకు తన వంతు తోడ్పాటునిచ్చిన ఇమ్రాన్ మీర్జా చెప్పారు. ‘ఇది ఆమె జీవితానికి సంబంధించిన పుస్తకం. ఈ రోజు దాకా ఆమె జీవితంలో ఎదురయిన వివాదాలు, సాధించిన విజయాలు, ఆమె జీవితం, కెరీర్ సహా అన్ని విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయని ఆయన చెప్పారు. హార్పర్ కోలిన్స్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని త్వరలో ముంబయి సహా అన్ని ప్రధాన నగరాల్లోను ఆవిష్కరించనున్నారు. ముంబయిలో సల్మాన్ ఖాన్ ఆవిష్కరించవచ్చని తెలుస్తోంది. 40 చాప్టర్లుగా ఉండే ఈ పుస్తకం సానియా నాలుగైదేళ్ల చిన్నారిగా ఉన్నప్పుటినుంచి మొదలై, నేటి దాకా ఉంటుందని కూడా ఇమ్రాన్ మీర్జా చెప్పారు.

‘బాలీవుడ్ బాద్‌షా’తో సానియా (ఫైల్ ఫొటో)