క్రీడాభూమి

టెస్టు క్రికెట్‌కు టేలర్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, జూలై 12: వెస్టిండీస్ పేస్ బౌలర్ జెరోమ్ టేలర్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 13 ఏళ్ల నుంచి కెరీర్ కొనసాగిస్తున్న అతను ఇకమీదట పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. ఇప్పటివరకూ 46 టెస్టుల్లో 130 వికెట్లు సాధించిన టేలర్ (32) టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కావాలన్న నిర్ణయాన్ని తమకు తెలియజేయడంతో త్వరలో భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడే వెస్టిండీస్ జట్టులో చోటు కల్పించలేదని విండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) ఒక ప్రకటనలో వెల్లడించింది. 2003లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన టేలర్ గత ఏడాది ఆస్ట్రేలియాతో చివరిసారి అంతర్జాతీయ టెస్టు సిరీస్‌లో ఆడాడు. గాయాలతో తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొన్న టేలర్ 2009-14 మధ్య కాలంలో దాదాపు పూర్తిగా ఐదేళ్లు టెస్టు క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. గత ఏడాది సబీనా పార్క్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టేలర్ 47 పరుగులకు 6 వికెట్లు కైవసం చేసుకుని కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. 13 ఏళ్ల టెస్టు కెరీర్‌లో నాలుగు మ్యాచ్‌లలో ఐదు కంటే ఎక్కువ వికెట్లు సాధించిన టేలర్ న్యూజిలాండ్‌తో 2008లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 106 పరుగులతో రాణించాడు. టెస్టు క్రికెట్‌లో టేలర్ సాధించిన అత్యుత్తమ స్కోరు ఇదే.