క్రీడాభూమి

భారత్‌తో సిరీస్ సవాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెసెటెరి (సెయింట్ కిట్స్), జూలై 12: అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేని యువ ఆటగాళ్లతో కూడిన తమ జట్టుకు భారత్‌తో టెస్టు సిరీస్ ఒక సవాలేనని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అభిప్రాయ పడ్డాడు. ‘ఇది చాలా క్లిష్టమైన సిరీస్. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో భారత్ నంబర్ టూ స్థానంలో ఉంది. ఆ జట్టుకు మంచి బ్యాటింగ్ లైనప్‌తో పాటుగా, మంచి బౌలింగ్ లైనప్ కూడా ఉంది. యువకులతో ఉన్న ఈ జట్టుకు ఇది గొప్ప సవాలే’నని హోల్డర్ అన్నాడు. ‘మా జట్టులో అందరూ పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లే ఉన్నారు. వీళ్లంతా ఒక జట్టుగా కుదురుకోవడానికి, ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మేము ఇప్పుడు సంధి దశలో ఉన్నాం. ఒక టెస్టు జట్టును తయారు చేసే యత్నంలో ఉన్నాం. అందుకు కొంత సమయం పడ్తుంది’ అని అతను అన్నాడు. రోజులో 90 ఓవర్లు ఆడి , తొలి ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ స్కోరు సాధించడం అనే విషయంలో మేము గతంలో విఫలమైనాం. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు ఇదే విషయాన్ని నొక్కి చెప్పాలని అనుకుంటున్నాను. మొదట బ్యాటింగ్ చేసినా లేక మొదట బౌలింగ్ చేసినా సరే ఇతరులకు ఆదర్శంగా నిలవడం ముఖ్యం’ అని హోల్డర్ చెప్పినట్లు ‘బార్బడోస్ టుడే’ పత్రిక తెలిపింది. కాగా, ఈ సిరీస్‌నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని అడగ్గా, తనకు సంబంధించినంతవరకు పరుగులు చేయడం ముఖ్యమని, గత ఏడాది తాను సెంచరీ చేశానని, అయితే ఈ సారి ఇప్పటివరకు ఒక్కటీ లేదన్నాడు. ఈ సిరీస్‌లో ఒక సెంచరీ సాధించాలని అనుకుంటున్నానని హోల్డర్ చెప్పాడు.