క్రీడాభూమి

హఫీజ్, అజర్‌తో మాట్లాడుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, డిసెంబర్ 25: కళంకిత ఫాస్ట్‌బౌలర్ ముహమ్మద్ ఆమీర్ ఉన్న లాహోర్ జాతీయ శిక్షణా శిబిరానికి హాజరయ్యేది లేదని తెగేసి చెప్తున్న సీనియర్ ఆటగాళ్లు మహమ్మద్ హఫీజ్, అజర్ అలీలతో మాట్లాడడం ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ప్రయత్నించాడు. అమీర్‌కు సంబంధించిన సమస్యలపై తాను ఇప్పటికే కొంతమంది సీనియర్ క్రికెటర్లతో మాట్లాడానని, వాళ్ల అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రయత్నించామని ఖాన్ గురువారం రాత్రి చెప్పారు. తాను మరోరి హఫీజ్, అజర్‌లతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని కూడా ఆయన చెప్పాడు. ఆమీర్ ఉన్న శిబిరంలో తాము పాలు పంచుకునేది లేదని పాకిస్తాన్ జాతీయ వన్‌డే కెప్టెన్ అజర్ అలీ జియో న్యూస్ చానల్‌కు చెప్పాడు. అయితే ఈ విషయంపై పిసిబి చైర్మన్‌తో మాత్రమే చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పాడు. హఫీజ్ కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. శుక్రవారం ఉదయం అజర్ అలీ, హఫీజ్ ఇద్దరూ శిక్షణా శిబిరానికి వచ్చారని, అయితే మధ్యాహ్నం తర్వాత వెళ్లిపోయారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఆమీర్‌తో కలిసి ట్రైనింగ్‌లో పాల్గొనడంపై తమ అభ్యంతరాలను వాళ్లుహెడ్ కోచ్ వకార్ యూనస్‌కు చెప్పి నేరుగా ఇంటికి వెళ్లిపోయారని వర్గాలు తెలిపాయి.
కరాచీలో జరుగుతున్న క్వాయిద్-ఎ- ఆజమ్ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఆడుతున్న కారణంగా హఫీజ్, అజర్, మరి కొందరు ఆటగాళ్లు గురువారం మాత్రమే శిబిరంలో చేరారు. జనవరిలో న్యూజిలాండ్ పర్యటనకోసం ఈ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసారు. కాగా, ఆటగాళ్లు గనుక పిసిబి అభిప్రాయాలను అర్థం చేసుకకపోతే ఏం చేయాలనే దానిపై ఆధికారులు అప్పుడు ఆలోచిస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా షహర్యార్ ఖాన్ చెప్పాడు. నిన్న రాత్రి ఈ ఇద్దరు ఆటగాళ్లు పిసిబి చీఫ్‌ను కలిసారు కానీ ప్రతిష్టంభన అలాగే ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.