క్రీడాభూమి

హాకీ ఒలింపియన్ ఆంటిక్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 13: హాకీ ఒలింపియన్ జో ఆంటిక్ (90) కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆంటిక్ మంగళవారం రాత్రి ముంబయిలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో రజత పతకాన్ని సాధించిన భారత జట్టులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఆంటిక్‌కు కుమారుడు విలియమ్, కుమార్తె రీటా ఉన్నారు. ఆంటిక్ సతీమణి 2011లోనే కన్నుమూసింది. దేశానికి ఎన్నో కీర్తిప్రతిష్టలు తెచ్చిన తన తండ్రికి జీవిత చరమాంకంలో ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం తీవ్ర మనస్థాపాన్ని కలిగిస్తోందని ఆంటిక్ కుమారుడు విలియమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. రోమ్ ఒలింపిక్స్‌లో ఆంటిక్ మన దేశానికి ప్రాతినిథ్యం వహించారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఆ ఒలింపిక్ ఫైనల్‌లోనే 1-0 గోల్ తేడాతో విజయం సాధించి 32 ఏళ్ల నుంచి కొనసాగుతున్న భారత జట్టు జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. అనంతరం రెండేళ్లకు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో మరోసారి పాకిస్తాన్‌పై ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో కూడా ఆంటిక్ సభ్యునిగా ఉన్నాడు. 1950వ దశకంలో సీనియర్ జట్టుతో కలసి తూర్పు ఆఫ్రికా, యూరప్‌లలో పర్యటించిన ఆంటిక్ 1980వ దశకం మధ్యలో పశ్చిమ రైల్వే నుంచి రిటైర్ అయ్యారు. ఆట నుంచి వైదొలిగిన తర్వాత కోచ్‌గా మారిన ఆంటిక్ 1973 ప్రపంచ కప్ టోర్నమెంట్ సందర్భంగా భారత జట్టుకు శిక్షణ ఇచ్చిన కోచ్‌లలో ఒకరుగా ఉన్నారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు ఆయన ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఒమన్ జాతీయ జట్టు 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొంది.