క్రీడాభూమి

నాలుగు వారాల ముందే బ్రెజిల్ చేరిన ఆర్చరీ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరికా (బ్రెజిల్), జూలై 13: రియో ఒలింపిక్స్‌కు సన్నద్ధమైన భారత ఆర్చరీ జట్టు అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు నాలుగు వారాల ముందే బ్రెజిల్ చేరుకుంది. భారత్ నుంచి రియో ఒలింపిక్స్‌కు వెళ్లిన తొలి జట్టు ఇదే. సపోర్టింగ్ స్ట్ఫాతో పాటు నలుగురు సభ్యులతో కూడిన ఈ జట్టు రియో డీ జెనిరోకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని తీరప్రాంత నగరం మరికాకు చేరుకుంది. ఈ జట్టు మరికాలో ఈ నెల 22వ తేదీ వరకు శిక్షణ పొంది ఆ తర్వాత ఒలింపిక్స్‌లో ఆర్చరీ పోటీలకు ఆతిథ్యమిచ్చే సోంబోడ్రోమోకు సమీపంలోని సెంట్రోకి వెళ్తుంది. నాలుగేళ్ల క్రితం లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఘోరంగా విఫలమై అభిమానుల ఆశలను నీరుగార్చిన భారత ఆర్చర్లు ఈసారి తమ ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోవడంపై దృష్టి కేంద్రీకరించారు. యోగాతో దినచర్య ప్రారంభించిన వీరు ఆ తర్వాత మరికాలోని ట్రైనింగ్ సెంటర్‌లో సాధన చేశారు. ట్రైనింగ్ సమయంలో తాము ఎవరితోనూ మాట్లాడేందుకు వీల్లేదని, కనుక ఒలింపిక్ క్రీడలు ముగిసే వరకు తన ఫోన్ ఆఫ్‌చేసే ఉంటుందని ఒక ఆర్చర్ తెలిపారు. కాగా, మరికాలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని, ఇప్పటివరకూ మూడుసార్లు ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొన్నామని, వీటిలో ఒక సెషన్ లైట్ల వెలుతురులో జరిగిందని భారత ఆర్చరీ జట్టు కోచ్ ధర్మేంద్ర తివారీ పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు. ఒలింపిక్స్‌లో భారత మొత్తం ఆర్చర్లు మూడు విభాగాల్లో పాల్గొననున్నారు. మహిళల జట్టులోని దీపికా కుమారి, లక్ష్మీరాణి మాఝీ, బొంబైలా దేవి అటు టీమ్ ఈవెంట్‌తో పాటు వ్యక్తిగత ఈవెంట్లలో పోటీపడనుండగా, పురుషుల విభాగంలో భారత జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమవడంతో అతాను దాస్ ఒక్కడే వ్యక్తిగత విభాగంలో తలపడనున్నాడు.