క్రీడాభూమి
కర్నీ సింగ్ స్మారక మీట్‌లో ‘టాప్‌గన్’ షూటర్ల హవా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, జూలై 13: కర్నీ సింగ్ స్మారక షూటింగ్ మీట్‌లో టాప్‌గన్ అకాడమీకి చెందిన షూటర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఏడు పసిడి పతకాలను కైవసం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,500 మందికి పైగా షూటర్లు పాల్గొన్నారు. బికనీర్ మార్క్స్‌మెన్ రైఫిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మీట్‌లో విజేతలకు అంతర్జాతీయ షూటర్ షిమోన్ షరీఫ్ బహుమతులను ప్రదానం చేశాడు. ‘ఈ క్రీడకు కొత్త అయిన మా షూటర్లు ఈ మీట్ ద్వారా తొలిసారి పోటీల్లో పాల్గొని అద్భుత ఫలితాలు సాధించడం ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది’ అని టాప్‌గన్ షూటింగ్ అకాడమీ వ్యవస్థాపకుడైన షిమోన్ షరీఫ్ హర్షాన్ని వ్యక్తం చేశాడు. టాప్‌గన్ అకాడమీ ఢిల్లీతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు షూటింగ్ రేంజ్‌లను నిర్వహిస్తోంది. ఈ అకాడమీకి చెందిన పలువురు షూటర్లు ప్రస్తుత జాతీయ జట్టులో సభ్యులుగా ఉన్నారు.