క్రీడాభూమి

కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటిన డివిలియర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిడ్జిటౌన్, జూలై 14: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సిపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు మరో విజయాన్ని సాధించింది. బుధవారం రాత్రి బ్రిడ్జిటౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 25 పరుగుల తేడాతో సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పేట్రియాట్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఎబి.డివిలియర్స్ (54 బంతుల్లో 82 పరుగులు) సత్తా చాటుకుని ట్రైడెంట్స్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. గత రెండు ఇన్నింగ్స్‌లో డివిలియర్స్‌కు ఇది రెండో అర్థశతకం కాగా, ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ అతను సాధించిన అత్యధిక స్కోరు ఇదే.
టాస్ గెలిచిన పేట్రియాట్స్ కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు ఆరంభంలో తడబడింది. ఓపెనర్లు స్టీవెన్ టేలర్ (2), రేమన్ రీఫెర్ (1)తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ (16) త్వరత్వరగా నిష్క్రమించడంతో ఆ జట్టు 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో ఎబి.డివిలియర్స్ క్రీజ్‌లో నిలదొక్కుకుని పేట్రియాట్స్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించాడు. దూకుడుగా ఆడిన వికెట్‌కీపర్ నికోలస్ పూరన్ (19 బంతుల్లో 38 పరుగులు)తో కలసి నాలుగో వికెట్‌కు 60 పరుగులు, కెప్టెన్ కీరన్ పొలార్డ్ (21 బంతుల్లో 27 పరుగులు)తో కలసి ఐదో వికెట్‌కు మరో 83 పరుగులు జోడించిన డివిలియర్స్ 82 పరుగులు సాధించి పెవిలియన్‌కు చేరాడు. చివర్లో డేవిడ్ వైస్ (1), వేన్ పార్నెల్ (1) అజేయంగా నిలవడంతో ట్రైడెంట్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. పేట్రియాట్స్ బౌలర్లలో షెల్డన్ కోట్రెల్ 25 పరుగులిచ్చి 3 వికెట్లు కైవసం చేసుకోగా, అల్జారీ జోసెఫ్, శామ్యూల్ బద్రీ, తబ్రైజ్ షంసీ ఒక్కో వికెట్ అందుకున్నారు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన పేట్రియాట్స్ జట్టును ట్రైడెంట్స్ బౌలర్లు గడగడలాడించారు. వీరి జోరును తట్టుకోలేక ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్ (18), జాన్ ట్రెవర్ స్మట్స్ (13) స్వల్పస్కోర్లకే నిష్క్రమించగా, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ డుప్లెసిస్ (42), జొనాథన్ కార్టర్ (46) మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోర్లు సాధించలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే రాబట్టిన పేట్రియాట్స్ జట్టు 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ 6 మ్యాచ్‌లు ఆడిన పేట్రియాట్స్‌కు ఇది ఐదో ఓటమి. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దిగజారింది.
సంక్షిప్తంగా స్కోర్లు
ట్రైడెంట్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 180/6 (ఎబి.డివిలియర్స్ 82, పూరన్ 38, కీరన్ పొలార్డ్ 27, షోయబ్ మాలిక్ 16, షెల్డన్ కోట్రెల్ 3/25, అల్జారీ జోసెఫ్ 1/30, శామ్యూల్ బద్రీ 1/41, తబ్రైజ్ షంసీ 1/32).
వికెట్ల పతనం: 1-3, 2-12, 3-29, 4-89, 5-172, 6-178.
పేట్రియాట్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 155/8 (జొనాథన్ కార్టర్ 46, ఫఫ్ డుప్లెసిస్ 42, లెండిల్ సిమ్మన్స్ 18, జాన్ ట్రెవర్ స్మట్స్ 13, ఇమ్రాన్ ఖాన్ 2/26, అకీల్ హుస్సేన్ 2/27, రవి రామ్‌పాల్ 2/30, రేమన్ రీఫెర్ 1/18, వేన్ పార్నెల్ 1/26).
వికెట్ల పతనం: 1-35, 2-45, 3-59, 4-115, 5-142, 6-142, 7-150, 8-151.

చిత్రం.. డివిలియర్స్