క్రీడాభూమి

నేటి నుంచి కొరియాతో డేవిస్ కప్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూలై 14: ఇక్కడ శుక్రవారంనుంచి ప్రారంభమయ్యే ఆసియా/ఓసియానా గ్రూపు-1డేవిస్ కప్ పోటీలో భాగంగా భారత్ కొరియా జట్టును ఢీకొంటోంది. అయితే పైకి ఫేవరేట్‌గా కనిపిస్తున్నప్పటికీ అతిథ్య జట్టును అనేక సమస్యలు వేధిస్తుండడం గమనార్హం. కీలక ఆటగాల్లయిన యుకి భంబ్రి, సోమ్‌దేవ్ బర్మన్‌లు ఇప్పటికీ గాయాలతో బాధపడుతూ ఉండడం, రియో ఒలింపిక్స్‌లో డబుల్స్ జోడీగా ఆడనున్న లియాండర్ పేస్ , రోహన్ బోపన్నల మధ్య విభేదాలు ఇంకా పూర్తిగా తొలగిపోని నేపథ్యంలో సింగిల్స్ ఆటగాళ్లుగా చెన్నైకి చెందిన యువ క్రీడాకారుడు రామ్‌కుమార్ రామనాథన్, సాకేత్ మైనేనిలు తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. 21 ఏళ్ల రామ్‌కుమార్ డేవిస్ కప్‌లో మన దేశం తరఫున తొలిసారిగా ఆడబోతున్నాడు. ఈ యువ ఆటగాడిలో మంచి ఆటగాడికుండాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ నిలకడ లేమి కారణంగా కొన్ని సందర్భాల్లో గెలవాల్సిన మ్యాచ్‌లలో సైతం ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. అయితే తనకన్నా మెరుగైన ఆటగాళ్లపైన కూడా గెలిచిన సందర్భాలు కూడా ఉండడంతో శుక్రవారం జరిగే సింగిల్స్ మ్యాచ్‌లలో మైనేనితో కలిసి అతను సింగిల్స్‌లో తమ జట్టుకు విజయాలను సాధించి పెడ్తారని ఆశిస్తున్నారు. కాగా, డబుల్స్‌లో చాలాకాలం తర్వాత పేస్, బోపన్నలు జోడీగా బరిలోకి దిగనున్నారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ కలిసి డబుల్స్ ఆడనప్పటికీ రియో ఒలింపిక్స్‌లో వీరిద్దరూ కలిసి ఆడాల్సి ఉన్నందున గతాన్ని పక్కన పెట్టి దేశ గౌరవానికే ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నారు. ఇదే విషయమై విలేఖరులు బోపన్నను అడగ్గా, పాత ఘటనలను మరిచిపోయి ప్రస్తుతంపైనే తాను దృష్టిపెట్టాలని అనుకుంటున్నానని అతను చెప్పడం విశేషం. మరోవైపు కొరియా జట్టులో టాప్ ర్యాంక్ ఆటగాడయిన హేయోన్ చుంగ్ లేకపోవడం పెద్ద లోటేనని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆ జట్టులోని మిగతా ఆటగాళ్లంతా కూడా అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో బాగా వెనుకబడిన వారే. పచ్చిక మైదానాల్లో ఆడుతుండడం, పైగా అభిమానుల ఉత్సాహం కలిసి మన ఆటగాళ్లకు అనుకూలమవుతుందని పరిశీలకులు అంటున్నారు.