క్రీడాభూమి

ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 152వ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: ఫుట్‌బాల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ మరింత ఉన్నత స్థానానికి దూసుకెళ్లింది. గత నెలలో లావోస్‌పై వరుసగా రెండు విజయాలు సాధించిన భారత జట్టు తాజాగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఏకంగా 11 స్థానాలను ఎగబాకి 152వ ర్యాంకుకు చేరుకుంది. గత నెల స్వదేశంలో జరిగిన ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో 6-1 గోల్స్ తేడాతో లావోస్‌పై ఘనవిజయం సాధించిన భారత జట్టు ఆ తర్వాత 1-0 తేడాతో లావోస్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి 2019లో జరిగే ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించిన విషయం విదితమే. ఈ రెండు విజయాలతో 49 పాయింట్లను కూడగట్టుకున్న భారత జట్టు ప్రస్తుతం దక్షిణాసియాకు సంబంధించిన ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనూ, ఆసియా ఖండానికి సంబంధించిన ర్యాంకింగ్స్‌లో 27వ స్థానంలోనూ నిలిచింది. ఈ నెల ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఎక్కువ స్థానాలను అధిగమించిన ఆసియా దేశాల్లో తజకిస్తాన్ (19 స్థానాలు ఎగబాకి 145వ ర్యాంకుకు చేరింది) ప్రథమ స్థానంలో నిలువగా, యెమెన్ (16 స్థానాలు ఎగబాకి 160వ ర్యాంకు), తుర్క్‌మెనిస్తాన్ (14 స్థానాలు ఎగబాకి 120వ ర్యాంకు) తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇదిలావుంటే, కోపా అమెరికా టోర్నమెంట్ ఫైనల్‌లో అర్జెంటీనా జట్టు ఓటమిపాలైనప్పటికీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. అలాగే ఇంతకుముందు వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో నిలిచిన బెల్జియం, కొలంబియా, జర్మనీ, చిలీ జట్ల ర్యాంకింగ్‌లు కూడా మారలేదు. అయితే కొద్ది రోజుల క్రితం యూరో-2016 టోర్నమెంట్‌లో చాంపియన్‌గా అవతరించిన పోర్చుగల్ రెండు స్థానాలను మెరుగుపర్చుకుని ఆరో ర్యాంకుకు చేరుకోగా, ఈ టోర్నీ ఫైనల్‌లో ఓటమిపాలైన ఫ్రాన్స్‌కు 7వ ర్యాంకు, స్పెయిన్‌కు 8వ ర్యాంకు, బ్రెజిల్‌కు 9వ ర్యాంకు, ఇటలీకి 10వ ర్యాంకు లభించాయి.