క్రీడాభూమి

ప్రవీణ్ అమ్రేకి ద్వంద్వ ప్రయోజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 14: భారత మాజీ టెస్టు క్రికెటర్ ప్రవీణ్ అమ్రే, కర్నాటక మాజీ స్పిన్నర్ రఘురామ్ భట్‌లకు ద్వంద్వ ప్రయోజనాలున్నట్లు క్రికెట్‌బోర్డు నియమించిన అంబుడ్స్‌మన్ గుర్తించారు. అయితే భారత జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్‌పై వచ్చిన ఇలాంటి ఆరోపణల్లో నిజం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రాజీవ్ శుక్లాపైకూడా ఇలాంటి ఆరోపణలే రాగా బిసిసిఐ అంబుడ్స్‌మన్‌గా నియమించిన రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎపి షా వాటిలో నిజం లేదని నిర్ధారించినట్లు బిసిసిఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాలను బట్టి తెలుస్తోంది. ముంబయి క్రికెట్ అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ సభ్యుడుగా, అలాగే ఐపిఎల్ జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచింగ్ బృందంలో సభ్యుడుగా కూడా ఉన్న అమ్రేకు ద్వంద్వ ప్రయోజనాలున్నట్లు అంబుడ్స్‌మన్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను 2015లో జరిగిన ఐపిఎల్ టోర్నమెంట్‌కన్నా ముందే తాను ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచ్‌గా చేరానని, ఆ తర్వాత మాత్రమే తాను ముంబయి క్రికెట్ అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా చేరానని అమ్రే ఇచ్చిన సమాధానంతో అంబుడ్స్‌మన్ ఏకీభవించలేదు. ఈ ఏడాది కూడా ఢిల్లీ డేర్‌డెవిల్సతో అమ్రే కాంట్రాక్ట్ పొడిగించడం తెలిసిందే.బిసిసిఐ అనుబంధ యూనిట్ల మేనేజింగ్ కమిటీ సభ్యులతో సహా ఒక పాలనాధికారి లేదా వారి సమీప బంధువు ఎవరు కూడా ఐపిఎల్ ఫ్రాంచైజీకి చెందిన పే రోల్స్‌లో ఉండకూడదని బిసిసిఐ నిబందనలు స్పష్టం చేస్తున్నందున అమ్రే వాదనలో పస లేదని జస్టిస్ షా అభిప్రాయ పడ్డాడు. బిసిసిఐలో అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నప్పుడు అమ్రే ఐపిఎల్ ఫ్రాంచైజ్ కోచింగ్ స్టాప్ పదవిని చేపట్టి ఉండకూడదని ఆయన తన ఉత్తర్వులో అభిప్రాయ పడ్డాడు. అమ్రేపై తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆయన క్రికెట్ బోర్డును ఆదేశింశించాడు కూడా.
కాగా ప్రస్తుతం ముంబయి క్రికెట్ అసోసియేషన్ వైస్‌ప్రెసిడెంట్‌గా, జాతీయ క్రికెట్ అకాడమీ( రెండూ కూడా గౌరవ పదవులే) ఉన్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కూడా అయిన దిలీప్ వెంగ్‌సర్కార్ పుణెలో జూనియర్ క్రికెటర్ల కోసం అకాడమీ నడుపుతున్నారని, ఆయన వారికి ఫేవర్ చేసే అవకాశముందంటూ జస్టిస్ షాకు ఫిర్యాదు వచ్చింది. అయితే జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ పదవి అనేది ఒక గౌరవ పదవి మాత్రమేనని తన ప్రయాణ, వసతి ఖర్చులను బోర్డు భరించడం మామూలేనని వెంగ్‌సర్ తన సమాధానంలో తెలియజేశాడు. అంతేకాకుండా భారత జట్టు మాజీ కెప్టెన్ దృష్టితో తన పదవిని చూడాలని కూడా ఆయన కోరాడు. ఇక తాను గత 21 సంవత్సరాలుగా క్రికెట్ అకాడమీలను నడుపుతున్నట్లు కూడా వెంగ్‌సర్కార్ ఆ సమాధానంలో తెలియజేశాడు.బిసిసిఐ నిబంధనల ప్రకారం ఇందులో ద్వంద్వ ప్రయోజనాలు ఏమీ లేవని, చర్య తీసుకోవలసినది కూడా ఏమీ లేదని కూడా జస్టిస్ షా స్పష్టం చేశారు.
కాగా, శుక్లా భార్య ఒక న్యూస్ చానల్ యజమానిగా ఉన్నారని, 2012నుంచి బిసిసిఐ నిర్వహించే మ్యాచ్‌లన్నిటికీ ప్రసార హక్కులు కలిగి ఉన్న స్టార్ ఇండియా ఈ చానల్‌కు తన యాడ్స్‌ను విక్రయిస్తుందంటూ మరో ఫిర్యాదు కూడా వచ్చింది. అయితే ఐపిఎల్ మ్యాచ్‌లకు స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ కాదని శుక్లా తన సమాధానంలో తెలియజేశాడు. అంతేకాదు, భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌లకు చెందిన ప్రసార హక్కులను ఇచ్చేది బిసిసిఐకి చెందిన మార్కెటింగ్కమిటీ అని, ఆ హక్కులు ఇచ్చే సమయంలో కానీ, ఇప్పుడు కానీ తాను ఆ కమిటీలో సభ్యుడిగా లేనని కూడా శుక్లా తన సమాధానంలో స్పష్టం చేశాడు. తన భార్యకు చెందిన టీవీ నెట్‌వర్క్‌కు, స్టార్ ఇండియాకు మధ్య కుదిరిన సేల్స్ అగ్రిమెంట్ పూర్తిగా వాణిజ్యపరమైందేనని కూడా ఆయన తెలిపారు.

చిత్రాలు.. క్లీన్‌చిట్ పొందిన వెంగ్ సర్కార్, రాజీవ్ శుక్లా