క్రీడాభూమి

గెలుపు నాదే విజేందర్ ధీమా * నేడే హోప్‌తో పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన తర్వాత ఇప్పటివరకు ఓటమి ఎరుగని భారత బాక్సింగ్ స్టార్ విజేందర్ సింగ్ శనివారం ఇక్కడ డబ్ల్యుటిఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్ కోసం ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ హోప్‌ను ఢీకొంటున్నాడు.హోప్‌ను సులువుగా ఓడించగలనన్న ధీమాతో అతను ఉన్నాడు. ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత పాల్గొన్న ఆరు ప్రొఫెషనల్ బాక్సింగ్ పోటీల్లోను 30 ఏళ్ల విజేందర్ ప్రత్యర్థిని మట్టి కరిపించి మరీ గెలిచాడు. అయితే డబ్ల్యుబిసిసి మాజీ చాంపియన్ అయిన హోప్‌లాంటి పేరున్న ప్రత్యర్థిని ఢీకొనడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు పాల్గొన్న 30 పోటీల్లోను అతను 23 పోటీల్లో గెలుపొందగా కేవలం ఏడింటిలో ఓడిపోయాడు. తాను రేపటిదాకా ఆగలేనని, దాదాపు ఆరేళ్ల తర్వాత ఢిల్లీలో తాను పోటీ పడబోతున్నానని విజేందర్ అంటూ అది తనకు ఎంతో ఉత్కంఠ కలిగిస్తోందన్నాడు. ఇప్పటివరకు విజేందర్‌ను ఎదుర్కొన్న ప్రత్యర్థులెవరు కూడా ఆయనకు సరిజోడీ కాదు. అయితే హోప్ మాత్రం గట్టి పోటీ ఇస్తాడని నిపుణులు భావిస్తున్నారు.
కాగా, శనివారం ఇక్కడి త్యాగరాజ స్టేడియంలో జరగబోయే ఈ పోటీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, బాబా రామ్‌దేవ్, ప్రముఖ క్రికెటర్లు కపిల్‌దేవ్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెవాగ్, మేరీ కోమ్ తదితర ప్రముఖులు హాజరు కానున్నారు.