క్రీడాభూమి

హాల్ ఆఫ్ ఫేమ్ సెమీస్‌కు బగ్దాటిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూపోర్ట్, జూలై 15: న్యూపోర్ట్‌లో జరుగుతున్న హాల్ ఆఫ్ ఫేమ్ ఎటిపి టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో సైప్రస్ ఆటగాడు మార్కోస్ బగ్దాటిస్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన బగ్దాటిస్ గురువారం అర్థరాత్రి జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఇజ్రాయిల్‌కు చెందిన ఏడో సీడ్ ఆటగాడు డుడీ సెలాపై విజయం సాధించాడు. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ పోరులో బగ్దాటిస్ 6-2, 7-5 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. కాగా, అంతకుముందు సింగిల్స్ రెండో రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లలో మూడో సీడ్ ఆటగాడు గిలెస్ ముల్లర్, ఆరో సీడ్ ఆటగాడు అడ్రియన్ మన్నారినో తమతమ ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించారు. అన్‌సీడెడ్ ఆటగాడు శామ్ గ్రోత్‌తో జరిగిన పోరులో మన్నారినో 7-6, 6-3 తేడాతో విజయం సాధించగా, ముల్లర్ 7-6, 6-4 తేడాతో విక్టర్ ఎస్ట్రెల్లా బర్గోస్‌ను ఓడించాడు.