క్రీడాభూమి

మసరోవా సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాడ్ (స్విట్జర్లాండ్), జూలై 15: స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న స్టాడ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో 16 ఏళ్ల స్థానిక యువ క్రీడాకారిణి రెబెకా మసరోవా సత్తా చాటుకుంది. తొలిసారి డబ్ల్యుటిఎ టోర్నమెంట్ బరిలోకి దిగిన ఆమె సింగిల్స్ తొలి రౌండ్ పోరులో ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి జెలెనా జాంకోవిచ్‌పై సంచలన విజయం సాధించింది. వర్షం వలన గురువారం అర్థరాత్రి ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మసరోవా 1-6 తేడాతో తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో విజృంభించింది. పవర్‌ఫుల్ షాట్లతో రెచ్చిపోయిన ఆమె 6-4, 6-2 తేడాతో వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని జాంకోవిచ్‌ను మట్టికరిపించి అందరినీ ఔరా అనిపించింది. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ జూనియర్ విభాగంలో చాంపియన్‌షిప్ సాధించి, ఈ టోర్నీలో వైల్డ్‌కార్డుతో ఆడుతున్న మసరోవా రెండో రౌండ్‌లో క్రొయేషియాకు చెందిన అనెట్ కొంటావెయిట్‌తో తలపడనుంది.
స్నిదర్‌కు ఆదిలోనే చుక్కెదురు
ఇదిలావుంటే, ఈ టోర్నీలో వైల్డ్‌కార్డ్‌తో ఆడుతున్న మాజీ టాప్-10 క్రీడాకారిణి పాటీ స్నిదర్ (37)కు ఆదిలోనే చుక్కెదురైంది. సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆమె 6-2, 5-7, 4-6 తేడాతో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కటెరినా సినియకోవా చేతిలో పరాజయం పాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో ఏడో సీడ్ మోనా బర్తెల్‌తో పాటు అన్‌సీడెడ్ క్రీడాకారిణి కరినా విథోఫ్ట్ తమతమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్‌లో ప్రవేశించారు.