క్రీడాభూమి

కొరియన్లకు దెబ్బ మీద దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూలై 15: డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ దక్షిణ కొరియాతో జరిగిన ఆసియా/ఓషియానియా గ్రూప్-1 పోరులో ఆతిథ్య భారత్ శుభారంభాన్ని సాధించింది. ప్రత్యర్థులకు తొలి రోజే షాకు మీద షాక్ ఇచ్చి సత్తా చాటుకున్న రామ్‌కుమార్ రామనాథన్, సాకేత్ మైనేని భారత్‌కు 2-0 తేడాతో తిరుగులేని ఆధిక్యతను అందించారు. పవర్‌ఫుల్ షాట్లతో అలరించిన వీరి సర్వీసులకు కొరియా ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 217వ స్థానంలో కొనసాగుతున్న రామ్‌కుమార్ డేవిస్ కప్ బరిలోకి దిగడం ఇదే తొలిసారి. అయినప్పటికీ 156 నిమిషాల పాటు సాగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో అతను అద్భుతమైన ఆటతీరును కనబర్చి సియోంగ్ చాన్ హాంగ్‌ను మట్టికరిపించాడు. ఆరంభం నుంచే పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించి తొలి సెట్‌ను 6-3 తేడాతో తొలి సెట్‌ను కైవసం చేసకున్న రామ్‌కుమార్‌కు ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. దీంతో 2-6 తేడాతో రెండో సెట్‌ను కోల్పోయిన రామ్‌కుమార్ మళ్లీ రెచ్చిపోయాడు. ఫలితంగా 6-3 తేడాతో మూడో సెట్‌ను గెలుచుకున్న రామ్‌కుమార్ నాలుగో సెట్‌లో 6-5 ఆధిక్యత సాధించిన తర్వాత ప్రత్యర్థి కుడి తొడకు గాయమైంది. దీంతో అతను ఓటమిని అంగీకరించి వైదొలగడంతో రామ్‌కుమార్ 1-0 తేడాతో భారత్‌కు శుభారంభాన్ని అందించాడు.
ఆ తర్వాత సాకేత్ మైనేనితో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సింగిల్స్ మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన సీనియర్ ఆటగాడు యంగ్ క్యు లిమ్ విజయం సాధిస్తాడని కొరియా జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఆ మ్యాచ్‌లో సాకేత్ ప్రత్యర్థిని చిత్తుచేసి కొరియా ఆశలపై నీళ్లు చల్లాడు. నువ్వా-నేనా అన్నట్లు ఆద్యంతం హోరాహోరీగా జరిగిన ఈ పోరులో సాకేత్ 6-1, 3-6, 6-4, 3-6, 5-2 తేడాతో విజయం సాధించి భారత్‌కు 2-0 తేడాతో తిరుగులేని ఆధిక్యతను అందించాడు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో హాంగ్ చుంగ్, యున్‌సియాంగ్ చుంగ్ జోడీని ఓడించి ఈ పోరును ముగించాలని భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, అతని భాగస్వామి రోహన్ బొపన్న ఎదురుచూస్తున్నారు.