క్రీడాభూమి

అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్స్ 19 నుంచి ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ సమాఖ్య (ఐఎఎఎఫ్) ఆధ్వర్యాన ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు పోలెండ్‌లోని బిడ్గోస్క్‌లో జరిగే ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్-2016లో మన దేశానికి మొత్తం 27 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించనున్నారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఎఎఫ్‌ఐ) శనివారం వెల్లడించింది. ఇటీవల వియత్నాంలో జరిగిన 17వ ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్, అలాగే గత నెల బెంగళూరులో నిర్వహించిన ఫెడరేషన్ కప్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ సహా వివిధ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనలతో రాణించి ఐఎఎఎఫ్ అర్హతా ప్రమాణాలను అందుకున్న క్రీడాకారులను ప్రపంచ అండర్-20 చాంపియన్‌షిప్స్‌కు ఎంపిక చేశారు. ఈ పోటీలకు ఎంపికైన భారత జట్టులోని 18 మంది పురుషులు, తొమ్మిది మంది మహిళలు 16 ఈవెంట్లలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో జావెలిన్ త్రో నేషనల్ రికార్డు హోల్డర్ నీరజ్ చోప్రా, గతేడాది ఆసియా యువజన క్రీడల 800 మీటర్ల పరుగులో చాంపియన్‌షిప్ సాధించిన బియాంత్ సింగ్, కామనె్వల్త్ యూత్ గేమ్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న జిస్నా మాథ్యూ, 800 మీటర్ల రేస్ కాంస్య పతక విజేత అబితా మేరీ మాన్యుయేల్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం పటియాలా శిక్షణా శిబిరంలో ఉన్న భారత జట్టు ఆదివారం ఢిల్లీ నుంచి పోలెండ్‌కు బయలుదేరుతుంది.