క్రీడాభూమి

భయం.. అనవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 16: టర్కీలోని ట్రబ్జాన్‌లో జరుగుతున్న వరల్డ్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొంటున్న మొత్తం 149 మంది భారత క్రీడాకారులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టం చేశారు. సైనిక తిరుగుబాటుతో అట్టుడుకుతున్న టర్కీలో దాదాపు 60 మంది ప్రజలు మృతిచెందడంతో ఆ దేశంలోని భారత రాయబారితో పాటు విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు జరిపానని, టర్కీలోని ట్రబ్జాన్ ప్రాంతంలో వరల్డ్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొంటున్న మొత్తం 149 మంది భారత క్రీడాకారులంతా సురక్షితంగా ఉన్నట్లు వారు ధ్రువీకరించారని విజయ్ గోయల్ శనివారం బెంగళూరులో వెల్లడించారు. ప్రస్తుతం టర్కీలో నెలకొన్న పరిస్థితుల గురించి వరల్డ్ స్కూల్ గేమ్స్ నిర్వాహకులతో పాటు ఎస్‌జిఎఫ్‌ఐ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నానని, అక్కడ క్రీడలు కొనసాగుతున్నాయని, మన దేశానికి చెందిన చిన్నారులంతా సురక్షితంగా ఉన్నారని, ఎస్‌జిఎఫ్‌ఐ సహకారంతో భారత క్రీడా ప్రాధికార సంస్థ (స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా) కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిందని విజయ్ గోయల్ తెలిపారు.