క్రీడాభూమి

సింగే కింగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ డబ్ల్యుబిఓ ఆసియా-పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 10 రౌండ్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో అతను 98-92, 98-92, 100-90 పాయంట్ల ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ హోప్‌ను మట్టికరిపించి ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన తర్వాత వరుస విజయాలతో అప్రతిహతంగా జైత్రయాత్ర సాగిస్తున్న విజేందర్‌కు స్వదేశంలో తొలి బౌట్ ఇదే. ఈ బౌట్‌లో ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించిన విజేందర్ ప్రత్యర్థిని చిత్తు చేయడంతో ప్రో బాక్సింగ్‌లో అతని వరుస విజయాల సంఖ్య ఏడుకు పెరిగింది.