క్రీడాభూమి

నేటి నుంచి గ్రేట్ ఇండియా రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: ‘గ్రేట్ ఇండియా రన్’ పేరుతో దేశంలో తొలిసారి నిర్వహిస్తున్న మల్టీ సిటీ మారథాన్ ఆదివారం ప్రారంభం కానుంది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన ప్రముఖ అథ్లెట్ అంజూ బాబీ జార్జ్‌తో కలసి కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్ న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఈ పరుగును ప్రారంభించనున్నారు. 1,480 కిలోమీటర్ల దూరం సాగే ఈ పరుగు పోటీలో అంతర్జాతీయ చాంపియన్ అరుణ్ భరద్వాజ్, డేవిడ్ బ్రెడో (డెన్మార్క్), మెలనీ డెలైనీ (దక్షిణాఫ్రికా), పూర్వపు సోవియట్ యూనియన్‌లో 8 రికార్డులు నెలకొల్పిన యూరీ ఎస్పెర్సన్ సహా ఆసియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాలకు చెందిన 15 మంది మేటి అథ్లెట్లు పాల్గొంటున్నారు. వీరితో పాటు ‘ఐరన్ మ్యాన్’గా పేరు పొందిన బాలీవుడ్ సెలబ్రిటీ అథ్లెట్ మిలింద్ సోమన్, గుల్ పనాంగ్ అహ్మదాబాద్ నుంచి సిల్వస్సా మీదుగా ముంబయి వరకు 570 కిలోమీటర్ల దూరం వరకు ఈ మారథాన్‌లో పాల్గొంటారు. ఆరు రాష్ట్రాల (్ఢల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర) మీదుగా 20 రోజుల పాటు సాగే ఈ మారథాన్ ఆగస్టు 6వ తేదీన ముంబయిలో ముగుస్తుంది.