క్రీడాభూమి

రంజీ కోచ్‌గా మనోజ్ ప్రభాకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, జూలై 16: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ మనోజ్ ప్రభాకర్ ఉత్తరప్రదేశ్ రంజీ జట్టుకు కొత్త కోచ్‌గా నియమితుడయ్యాడు. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ జట్టుకు కోచ్‌గా సేవలందించిన రిజ్వాన్ శంషాద్ ప్రస్తుతం సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనున్నాడు. శుక్రవారం ముస్సోరీలో జరిగిన ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వర్కింగ్ కమిటీ (యుపిసిఎ) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసున్నట్లు యుపిసిఎ డైరెక్టర్ పిడి.పాథక్ వెల్లడించాడు. యుపిసిఎ కార్యదర్శి, డైరక్టర్ రాజీవ్ శుక్లా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాడని ఆయన చెప్పాడు. జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా అరవింద్ కపూర్‌ను, మహిళా క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా నీతూ ద్వివేదిని నియమించడంతో పాటు అండర్-19, అండర్-16, అండర్-14 జట్ల కోచ్‌లు, మేనేజర్లను కూడా మార్చామని, అలాగే జింబాబ్వే మాజీ క్రికెటర్ హీత్ స్ట్రీక్‌ను గౌర్ హరి సింఘానియా క్రికెట్ అకాడమీకి కన్సల్టెంట్‌గా నియమించడం జరిగిందని పాథక్ తెలిపాడు.