క్రీడాభూమి

సమన్వయం అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూలై 16: లియాండర్ పేస్, తనకు మధ్య కోర్టులో చాలా గొప్పగా సమన్వయం ఉండిందని, అందుకే కొరియా జోడీపై సునాయాసంగా విజయం సాధించగలిగామని రోహన్ బోపన్న చెప్పాడు. డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం పేస్, బోపన్న జోడీ కొరియాకు చెందిన హోంగ్‌చుంగ్- సెయోన్ చాన్‌హాంగ్ జోడీపై 6-3, 6-4, 6-4 స్కోరుతో వరస సెట్లలో విజయం సాధించడం తెలిసిందే. చాలా కాలం తర్వాత పేస్‌తో కలిసి బోపన్న డబుల్స్ మ్యాచ్ ఆడడం ఇదే ప్రథమం. తమ ఇద్దరి మధ్య సమన్వయం గొప్పగా ఉండబట్టే తాము సునాయాసంగా విజయం సాదించగలిగామని మ్యాచ్ అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ బోపన్న చెప్పాడు. అయితే ఒలింపిక్స్‌పై అడిగిన ప్రశ్నలకు పేస్ సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. కానీయువ ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్, సాకేత్ మైనేనిలను ప్రశంసలతో ముంచెత్తాడు. తొలిసారిగా డేవిస్ కప్‌లో ఆడుతున్నప్పటికీ రామ్‌కుమార్ ఒత్తిడిని చాలా బాగా అధిగమించగలిగాడని, మైదానం చిత్తడిగా, జారుడుగా ఉన్నప్పటికీ పరిస్థితులను అర్థం చేసుకుని తన ఆటతీరును మార్చుకున్నాడని పేస్ అన్నాడు. మొత్తంమీద కొరియాను 3-0 తేడాతో ఓడించడం అంత సులభం కాదని, ఎందుకంటే ఆసియాలో కొరియా ఒక బలమైన శక్తి అని కూడా అతను అన్నాడు.