క్రీడాభూమి

ప్లే-ఆఫ్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూలై 16: డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత్ వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్ దశకు దూసుకెళ్లింది. ఆసియా/ఓషియానియా గ్రూప్-1లో శనివారం ఇక్కడ జరిగిన డబుల్స్ పోరులో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, అతని భాగస్వామి రోహన్ బొపన్న దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ చాన్ హాంగ్, హాంగ్ చుంగ్ జోడీని వరుస సెట్ల తేడాతో మట్టికరిపించి 3-0 తేడాతో భారత్‌ను ప్లే-ఆఫ్ దశకు చేర్చారు. చండీగఢ్ క్లబ్‌లోని గ్రాస్ కోర్టులో 101 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో పేస్, బొపన్న ఆద్యంతం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి 6-3, 6-4, 6-4 తేడాతో ప్రత్యర్థులను చిత్తు చేశారు. ఈ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం కొరియా ఆటగాళ్లతో జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లలో రామ్‌కుమార్ రామనాథన్, సాకేత్ మైనేని అద్భుత విజయాలు సాధించి తొలి రోజే భారత్‌కు 2-0 తేడాతో తిరుగులేని ఆధిక్యతను అందించిన తర్వాత తాజాగా డబుల్స్ మ్యాచ్‌లో పేస్, బొపన్న సునాయాసంగా ప్రత్యర్థులను మట్టికరిపించడంతో భారత్ 3-0 తేడాతో విజయం సాధించింది. దీంతో ఆదివారం సాకేత్-సియోంగ్, రామ్‌కుమార్-యంగ్ క్యు లిమ్ మధ్య జరుగనున్న రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు ప్రాధాన్యత కోల్పోయాయి.
చాలా కాలం నుంచి ‘ఉప్పు-నిప్పు’లా ఉంటున్న పేస్, బొపన్న త్వరలో జరుగనున్న రియో ఒలింపిక్స్‌లో భాగస్వాములుగా బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌కు ముందు వీరిద్దరూ కలసి ఆడిన ఏకైక మ్యాచ్ ఇదే. అయితే శుక్రవారం చండీగఢ్‌లో వర్షం కురవకపోవడంతో శనివారం కోర్టులో బంతి బాగా బౌన్స్ అయింది. దీంతో ఆరంభం నుంచే పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించిన పేస్, బొపన్నకు ప్రత్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. మూడో సెట్‌లో కొరియా ఆటగాళ్లు పేస్ సర్వీస్‌ను బ్రేక్ చేయగలిగినప్పటికీ భారత ఆటగాళ్ల జోరుకు వారు తలవంచక తప్పలేదు. డేవిస్ కప్ టోర్నీలో ఇప్పటివరకూ ఐదుసార్లు కలసి ఆడిన పేస్, బొపన్నకు ఇది మూడో విజయం. ఇంతకుముందు 2007లో కజకిస్థాన్, 2014లో సెర్బియా ఆటగాళ్లపై విజయం సాధించిన వీరు 2012లో ఉజ్బెకిస్థాన్, 2015లో చెక్‌రిపబ్లిక్ ఆటగాళ్ల చేతిలో పరాజయాలను ఎదుర్కొన్నారు.